News

బడ్జెట్లో, రైతన్నలకు మేలు చేసే ఈ అంశాలపై ప్రభుత్వం ద్రుష్టి పెట్టాలి

KJ Staff
KJ Staff

2024 లోకసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డిఏ ప్రభుత్వం, మూడోసారి కూడా తమ ప్రభుత్వాని ఏర్పాటు చేసింది. మోడీ ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టిన తరువాత, ప్రవేశపెట్టబోయే మొదటి బడ్జెట్ పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సారి బడ్జెట్లో ఏఏ రంగాలకు ప్రాధాన్యత ఇస్తారన్న విష్యంపై చర్చ కొనసాగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉండబోతుందని తెలుస్తుంది.

మరికొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ సారి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే వ్యవసాయ అభివృద్ధికి, ఆహార ద్రవ్యోర్బనం పెద్ద ఆటంకంగా మారింది. దీనితోపాటు వాతావరణం వేగంగా మార్పు చెందటం, కరువు పరిస్థితులు ఏర్పడటంతో ఆహార ఉత్పత్తుల్లో తగ్గుదల నమోదవుతుంది. దేశంలో ఆహార కొరత తగ్గించేందుకు ప్రభుత్వం ఆహార ఎగుమతులపై పరిమితులు విధించడం ద్వారా, చాలా మంది రైతులు నష్టపోతున్నారు. వీటన్నిటి కారణంగా వ్యవసాయంలో వృద్ధి రేటు తగ్గతూ వస్తుంది. దేశ ఆర్ధిక వ్యవస్థలో వ్యవసాయం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది, వ్యవసాయంలో అభివృద్ధి తగ్గినట్లైతే అది ఆర్ధిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

ఈ పరిస్థితిని మెరుగుపరిచే విధంగా, రానున్న బడ్జెట్లో అన్నదాత ఆర్ధిక పరిస్థితులను మెరుగుపరిచే విధంగా, ప్రభుత్వం కొన్ని సవరణలు చెయ్యాలని వ్యవసాయ నిపుణులు కోరుతున్నారు. వ్యవసాయ రంగం పుంజుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపి నిధులు కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనితోపాటు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు మరియు దిగుమతుల్లో కూడా తరచూ మార్పులు జరగడం వలన, చాలా మంది రైతులు నష్టపోతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ద్రుష్టి సారించి ఈ విధానాల్ని సరిచెయ్యవలసి ఉంది. ప్రభుత్వం ఇప్పటికే గోధుమలు, బియ్యం, చెక్కెర, ఉల్లిగడ్డ, పప్పులు వంటి ఆహార ఉత్పత్తులపై నిషేధం విధించింది, దీని వలన ఈ పంటలు పండిస్తున్న రైతుల ఆదాయం దెబ్బతింటుంది. ప్రభుత్వం దీని మీద పునరసమిక్ష నిర్వహించాలి.

ప్రస్తుతం మార్కెట్లో నకిలీ విత్తనాలు ఎక్కువుగా చలామణి అవుతున్నాయి, వీటిని మూలంగా రైతులు విలువైన సమయం మరియు డబ్బు వృధా అవుతున్నాయి. వీటిని ఆరికట్టవల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి స్థిరంగా ఉండే పత్తి, నూనెగుంజలు, వంటి పంటలకు మెరుగైన విత్తనాలు అందించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దీనితోపాటుగా గోధుమలు, మిర్చి, కూరగాయల పంటలు వాతావరణ ప్రతికూలతల మూలంగా తరచు దెబ్బతింటున్నాయి, స్థానికంగా ఈ పంటలు పండిస్తున్న రైతులకు ప్రోత్సహకాలు అందించాలి. దీనికి తగ్గట్టుగా రాబోయే బడ్జెట్ను రూపొందించవల్సి ఉంది.

పెరుగుతున్న ఆహార ద్రవ్యోర్బనాన్ని తగ్గించాలంటే, పప్పుధాన్యాలు, గోధుమలు, నూనెగింజలు మరియు పత్తి వంటి పంటల్లో దిగుబడి పెరగడానికి మరిన్ని పరిశోధనలు జరగవలసిన అవసరం ఉంది. దీనికి తగ్గట్టుగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి కేంద్రం నిధులు కేటాయించాలి, జీడీపీలో ఈ విభాగానికి ఇప్పుడిస్తున్న 0.6% నిధులను 1% పెంచాలి. నేలకు మరియు పర్యావరానికి మేలైన జీవన ఎరువులను సబ్సిడీ పరిధిలోకి తీసుకువస్తే రైతులకు లబ్ది చేకూరుతుంది. వీటన్నటితో పాటు, ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి సహాయం కింద అందించే ప్రధాన మంత్రి కృషి వికాస్ యోజన ప్రోత్సహకాన్ని రూ. 6000 నుండి రూ. 8000 వేలకు పెంచాలి. ఈ విధంగా జీడీపీలో వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన అంశాల మీద ప్రభుత్వం ద్రుష్టి సారిస్తే సుసంపన్నమైన వ్యవసాయ అభివృద్ధి సాధ్యపడుతుంది.

 

Share your comments

Subscribe Magazine

More on News

More