News

Budget 2024: వ్యవసాయరంగానికి ప్రముఖ్యత ఎంత?

KJ Staff
KJ Staff

నేడు పార్లమెంట్లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్, 2024-25 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ విడుదల చేసారు. యూనియన్ బడ్జెట్లో 9 రంగాల గురించి మాట్లాడిన నిర్మల సీతారామన్, వ్యవసాయ రంగంలో ఉత్పాదకతకు మరియు స్థితిస్థాపకతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మొత్తం 1.52 లక్షల కోట్లు రూపాయిల నిధులు కేటాయించారు. బడ్జెట్ సమావేశంలో మంత్రి ప్రస్తావించిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2024 ఎన్నికల్లో విజయడంఖా మోగించి ఎన్డిఏ ప్రభుత్వని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మొదటిసారి విడుదల చేసే బడ్జెట్ కోసం అందరూ ఉత్కంఠతో ఎదురుచూసారు, ఈ నిరీక్షణకు నేటితో తెరపడింది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ విడుదల చేసారు. ఈ ఏడాది బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. భారత దేశం వ్యవసాయ దేశం, దేశ ఆర్ధిక పురోగతి వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉంది. ఈ బడ్జెట్‌లో, ఉత్పాదకతను పెంపొందించడానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి మరియు రైతులకు మార్కెట్ యాక్సెస్‌ను మెరుగుపరచడానికి రూపొందించిన అనేక కీలక కార్యక్రమాలు మరియు సంస్కరణలను ఆర్ధిక మంత్రి వివరించారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో భారత ప్రజలు, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం మీద విశ్వాసం ఉంచి, చారిత్రాత్మకంగా మూడోసారి ఘన విజయం అందించారని ఆర్ధిక మంత్రి ప్రస్తావించారు. ఈ ఏడాది ఫిబ్రవరి లో విడుదల చేసిన మధ్యంతర బడ్జెట్లో పేర్కొన్న విధంగా పేదలు, మహిళలు, యువత మరియు రైతులపై ప్రత్యేక దృష్టిసారించాం అని తెలిపారు. దేశానికి అన్నం పెట్టె అన్నదాతలకు లభ్ది చేకూర్చాలన్న ఉద్దేశ్యంతో గత నెల అధిక కనీస మద్దతు ధర(MSP) ప్రకటించామని, తద్వారా అన్ని ప్రధాన పంటలకు 50 ఖర్చుకంటే ఎక్కువ మార్జిన్ ఇచ్చిన్నట్లు తెలియచేసారు. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను 5 సంవత్సరాల పాటు పొడిగించడంతో పాటు ఇప్పటివరకు ఈ పథకం ద్వారా దాదాపు 80 కోట్ల మందికి పైగా లబ్ధి పొందారని తెలియచేసారు.

దేశ పురోగతిలో యువత అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఈ అంశం మీద మాట్లాడిన మంత్రి, రూ. 2 లక్షల కోట్లతో 5 సంవత్సరాలలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం మరియు ఇతర అవకాశాలను సులభతరం చేయడానికి ప్రధానమంత్రి 5 పథకాలు మరియు కార్యక్రమాల ప్యాకేజీని ప్రకటించినందుకు సంతోషిస్తున్నాను అని తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్లో విద్య, ఉపాధి, మరియు నైపుణ్యం కోసం రూ. 1.48 లక్షల కోట్ల కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా భారతదేశానికి అవకాశాలను సృష్టించేందుకు తొమ్మిది ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని రోడ్‌మ్యాప్‌ జాబితాను సిద్ధం చేసి దానిని ఈరోజు సభలో ప్రవేశపెట్టారు. వీటిలో వ్యవసాయం, ఉపాధి, సమ్మిళిత అభివృద్ధి, తయారీ మరియు సేవలు, పట్టణాభివృద్ధి, ఇంధనం, ఇన్‌ఫ్రా, ఇన్నోవేషన్, R&D మరియు NexGen సంస్కరణలు గురించి వివరించారు.

రసాయన ఎరువులు మరియు పురుగుమందులతో కూడిన వ్యవసాయ చెయ్యడం మూలాన పర్యావరణ కాలుష్యం పెరిగిపోతుంది. దీనిని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, ఇందుకు తగ్గట్టుగానే రానున్న రెండేళ్లలో ఒక కోటిమంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా చేసి, వారి ఉత్పత్తులను విక్రయించుకోవడానికి బ్రాండింగ్ మరియు సర్టిఫికెట్ అందిస్తామని, నిర్మల సీతారామన్ తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడి, అధిక అధిక దిగుబడినిచ్చే, 109 హై-యీల్డింగ్ రకాలను విడుదల చేసారు, వాటి గురించి కూడా మంత్రి ప్రస్తావించారు.

పప్పుధాన్యాలు మరియు నూనె గింజలలో స్వయం సమృద్ధి సాధించడానికి, వాటి ఉత్పత్తి, నిల్వ మరియు మార్కెటింగ్‌ను సామర్ధ్యాని బలోపేతం చేస్తామని, ఆవాలు, వేరుశనగ, నువ్వులు, సోయాబీన్ మరియు పొద్దుతిరుగుడు వంటి నూనె గింజలకు ఆటనిభర్త సాధించడానికి కృషి చేస్తామని, ప్రధాన వినియోగ కేంద్రాలకు సమీపంలో కూరగాయల ఉత్పత్తి కోసం పెద్ద ఎత్తున క్లస్టర్లు అభివృద్ధి చేయబోతున్నామని, ఆర్థిక మంత్రి చెప్పారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో వ్యవసాయం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ)ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇది రైతులకు మరియు వారి భూములకు మూడేళ్లపాటు వర్తిస్తుంది. ఈ ఏడాదిలో 400 జిల్లాల్లో డీపీఐని ఉపయోగించి ఖరీఫ్ కోసం డిజిటల్ పంటల సర్వే చేపట్టనున్నారు. ఆరు కోట్ల మంది రైతులు, వారి భూముల వివరాలను రైతు, భూరిజిస్ట్రీలోకి తీసుకురానున్నారు. ఇంకా, జన్ సమర్థ్ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డ్ ఐదు రాష్ట్రాల్లో ప్రారంభించబోతున్నారు.

రొయ్యల ఉత్పత్తి మరియు ఎగుమతి కోసం, రొయ్యల సంతానోత్పత్తి కోసం న్యూక్లియస్ బ్రీడింగ్ సెంటర్ల నెట్‌వర్క్ ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందిస్తారు. రొయ్యల పెంపకం, ప్రాసెసింగ్ మరియు ఎగుమతి కోసం నాబార్డ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తారు. వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి స్వానిధి పథకం విజయవంతం కావడంతో, ఆర్థిక మంత్రి రాబోయే ఐదేళ్లలో ఎంపిక చేసిన నగరాల్లో 100 వీక్లీ హాట్‌లను ప్రోత్సహించడానికి కొత్త ప్రణాళికను ప్రకటించారు. గ్రామీణ మౌలిక సదుపాయాలతోపాటు గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం రూ.2.66 లక్షల కోట్లు కేటాయించింది. గ్రామీణ భూసంబంధిత చర్యలలో అన్ని భూములకు ప్రత్యేకమైన ఆధార్‌ను కేటాయించడం, భూసంబంధిత మ్యాప్‌ల డిజిటలైజేషన్, భూముల సర్వే మరియు ల్యాండ్ రిజిస్ట్రీ ఏర్పాటు వంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి. కార్మిక సంబంధిత సంస్కరణలపై, మన ప్రభుత్వం. ఉపాధి మరియు నైపుణ్యంతో సహా కార్మికుల కోసం అనేక రకాల సేవలను సులభతరం చెయ్యనున్నది.

Share your comments

Subscribe Magazine

More on News

More