News

సుస్థిరవ్యవసాయానికి 'కాబి' అందిస్తున్న డిజిటల్ టూల్స్.... వాడకం చాలా సులభం.....

KJ Staff
KJ Staff

ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఎక్కువుగా ఎదురుకుంటున్న సమస్యల్లో అధికమవుతున్న పురుగుమందుల వినియోగం ఒకటి. రసాయన మందులు, ఎరువులు పర్యావరణానికి తీరని నష్టాన్ని వాటిల్లేలా చేస్తున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు, ఒకవైపు ప్రభుత్వ సంస్థలు మరోవైపు అనేక స్వచ్చంద సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. రైతులు కూడా ఈ రసాయన ఎరువుల ద్వారా పర్యావరణానికి ముంచియున్న ముప్పును గుర్తించి వీటి వినియోగాన్ని తగ్గించి సుస్థిరవ్యవసాయం వైపు ముందుకు సాగుతున్నారు. కానీ మన దేశంలో చాలా మంది రైతులకు ఇటువంటి వ్యవసాయ విధానాల మీద సరైన అవగాహన లేన్నందువల్ల పూర్తిస్థాయిలో సుస్థిరవ్యవసాయాన్ని పాటించేలా చెయ్యడం కష్టతరంగా మారింది.

ఈ సమస్యను పరిష్కరించి, రైతులకు అవసరమైన సాంకేతిక జ్ఞానాన్ని అందించేందుకు, అంతర్జాతీయ స్వచ్చంద సంస్థ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయో-సైన్సెస్ ఇంటర్నేషనల్ (సిఏబిఐ- కాబి ) బయో ప్రొటెక్షన్ పోర్టల్ని రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతులందరూ వినియోగించుకునే విధంగా అన్ని భాషల్లోనూ వ్యవసాయ సమాచారం అందుబాటులో ఉంది. కాబి రూపొందించిన ఈ అప్ మరియు వెబ్సైట్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

కాబి సంస్థ గత 110 సంవత్సరాల నుండి పురుగులు, తెగుళ్ల మరియు వాటి నివారణ మీద పరిశోధన చేస్తున్న 48 దేశాలకు చెందిన వ్యవసాయ సంస్థలతో కలిసి పనిచేస్తుంది. భారత దేశంలో అన్ని వ్యవసాయ పరిశోధనలకు మూలమైన ఐసిఏఆర్ కూడా కాబి సంస్థతో భాగస్వామ్యం వహిస్తుంది. ఈ నేపథ్యంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం సహాయంతో ప్లాట్ఫార్మ్ వైస్ టూల్ కిట్ అనే పేరుతో డిజిటల్ టూల్ ని రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మొత్తం ఒకేచోట పొందుపరిచే విధంగా ఈ వెబ్సైట్ని రూపొందించింది. ఇది రైతులతో పాటు, వ్యవసాయ విద్యార్థులకు, పరిశోధకులకు, విస్తీర్ణ అధికారులకు, మరియు డీలర్లకు ప్రయోజకారిగా నిలువనుంది.

వెబ్సైటు మరియు అనేక ఆప్ ల ద్వారా రైతులు శాస్త్రీయమైన సలహాలు పొందవచ్చు. దీనిలో నాలెడ్జి బ్యాంకు పోస్టర్లు, కరపత్రాలు, ఫ్యాక్ట్షీట్ వీడియోలు ఇలా చాల రకాల సమాచారం అందుబాటులో ఉంది. దీనితోపాటు, పంట ఆరోగ్య సమాచారం దగ్గర నుండి, సురక్షితమైన పురుగుమందులు మరియు ఎరువులను సూచించడం, వాటి మోతాదును లెక్కించడం, చీడపీడల సమగ్రంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సమాచారం, వ్యవసాయంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు మీద నైపుణయాన్ని పెంపొందించడం ఇలా అన్ని పనులను ఈ వెబ్సైట్ పూర్తిచేస్తుంది. ఈ సేవలను వినియోగించుకోవడానికి స్మార్ట్ఫోన్, కంప్యూటర్, ఇలా ఏదైనా డిజిటల్ సాధనం ఉంటే సరిపోతుంది.

రైతులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు ఇలా అందరికి వ్యవసాయం పట్ల శిక్షణ అందించడం కోసం, పంట తెగుళ్ల నిర్ధారణ కోర్సులు, పంట యాజమాన్య కోర్సులు, బయోప్రొటెక్షన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రైతులు ఈ ఉచిత ఆన్లైన్ మాధ్యమాన్ని వినియోగించుకొని సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి పునాదిని ఏర్పరచవచ్చు. కాబి అందిస్తున్న క్రాప ప్రొటెక్షన్ ఆప్ ద్వారా సురక్షితమైన పురుగుమందులను గుర్తించడం మరియు వాటి మోతాదును లెక్కించడంలో సహాయపడుతుంది. కాబి బయోప్రొటెక్షన్ అనే వెబ్సైట్ ద్వారా పంట తెగుళ్లను నివారించడానికి స్థానికంగా నమోదైన బయో పెస్టిసిడ్స్ ను కనుగొనడంలో సహాయపడుతుంది.

Share your comments

Subscribe Magazine

More on News

More