ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈరోజు 2022-23 సీజన్‌కు ముడి జనప నారకి కనీస మద్దతు ధర (MSP)ని ఆమోదించింది. (Commission for Agricultural Costs and Prices.)వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ సిపారసులను ఆధారంగా తీసుకొని జనప నారకి కనీస మద్దతు ధరని ఆమోదించింది.
ముడి జనప నారకి కనీస మద్దతు ధరగా క్వింటాల్‌కు రూ.4750/-గా నిర్ణయించబడింది. గత సంవత్సరం తో పోలిస్తే ఈసారి రూ.250/- పెరిగింది. ఇది మొత్తం భారతదేశంలో సగటున అయ్యే ఉత్పత్తి వ్యయం కంటే 60.53 శాతం రాబడిని జనపనార రైతులు పొందేలా నిర్ధారిస్తుంది.జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (JCI) కేంద్ర ప్రభుత్వానికి నోడల్ ఏజెన్సీగా కొనసాగుతుంది. ఇది మద్దతు ధరకి సంబందించిన కార్యకలాపాలని పర్యవేక్షిస్తుంది.ఏవైనా నష్టాలు ఉంటే, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తిరిగి చెల్లిస్తుంది.
కనీస మద్దతు ధర:
కనీస మద్దతు ధర 1966 వ సంవత్సరంలో హరిత విప్లవ సమయంలో మొదలైంది. మొట్ట మొదటగా గోధుమ పంటకి గాను కనీస మద్దతు ధర లభించింది.రైతుల ఉత్పత్తులకు ప్రభుత్వం కనీస మద్దతు ధరను చెల్లించి కొనుగోలు చేస్తుంది. మార్కెట్‌లో ఏర్పడే పంట ధరల హెచ్చుతగ్గుల నుండిరైతులని రక్షించడమే దీని లక్ష్యం.ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రైతులకు లాభసాటిగా పరిగణించబడుతుంది.అయితే దీనికి ఎలాంటి చట్టపరమైన మద్దతు లేదు. పంట పండించడానికి అయ్యే ఖర్చుకి సుమారుగా 1.5 రెట్లు ఎక్కువగా కనీస మద్దతు ధర ఉంటుంది. ప్రస్తుతం 23 పంటలకు గాను కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరని అందిస్తుంది. ఇందులో తృణధాన్యాలు (7), పప్పుధాన్యాలు (5), నూనెగింజలు (7) మరియు వాణిజ్య పంటలు (4) ఉన్నాయి.
జనపనార ఉపయోగాలు:
చౌకగా, మృదువుగా మరియు ఫైబర్ యొక్క ఏకరూపత కారణంగా జనపనారకు చాలా డిమాండ్ ఉంది. బియ్యం, గోధుమలు, ధాన్యాలు మొదలైన వాటిని నిల్వ చేయడానికి వాడే గోనె సంచులను జనపనార తోనే తయారు చేస్తారు.నిల్వ ఉంచడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి దీనిని బ్రౌన్ పేపర్ బాగ్ అని పిలుస్తారు.జనపనార నుండి విభిన్నమైన ఉపఉత్పత్తులు తయారు అవుతాయి. సౌందర్య సాధనాలు , ఔషధాలు ,పెయింట్లు వంటి వాటిలో వీటి వాడకం అధికంగా ఉంటుంది. మన దేశములో జనపనార ఉత్పత్తి అధికంగా పశ్చిమ బెంగాల్ లో ఉంది.
మరిన్ని చదవండి.
Share your comments