ఇప్పటివరకు చలామణిలో ఉన్న రూ.2,000 నోట్లను మే శుక్రవారం రాత్రి నుంచి చలామణిలో నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు RBI (రిసర్వే బ్యాంకు బ్యాంక్ అఫ్ ఇండియా ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వార్త బయటకు రాగానే రూ . 2000 నోట్ల మార్పిడి పై అనేక సందేహాలు ప్రజలలో నెలకొన్నాయి . అందులో ప్రముఖమైనది బ్యాంకు ఖాతా లేనివారు రూ.2,000 నోట్లను ను ఎలా మార్చుకోవాలి ? బ్యాంకు ఖాతా లేకున్నా నోట్లను మార్చుకోవచ్చా ? అనే సందేహం ప్రజలలో నెలకొన్నది అలంటి వారికోసమే ఈ వార్త .
నోట్లను మార్చుకునే సమయం లో పౌరులు బ్యాంకులో ఒక ప్రొఫార్మాను పూరించాలి అని దీనిని అన్ని బ్యాంకులకు RBI పంపించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. అంటే దీనిప్రకారం రూ.2,000 నోట్ల మార్చుకోవాలి అనుకునే వాళ్ళు ఒక అప్లికేషన్ ను పూరించాలన్నమాట ఈ ప్రొఫార్మా మొదటి కాలమ్‌లో నోట్లను మార్పిడి చేయాలనుకునే వారి పూర్తి పేరు నమోదు చేయవలసి ఉంటుంది .
ఇది కూడా చదవండి .
111 జీవో ఎత్తివేత! తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..84 గ్రామాల్లో సంబరాలు
ఈ ప్రొఫార్మా రెండో కాలమ్‌లో గుర్తింపు ధ్రువీకరణ కార్డు తో సహా ఎన్ని రూ.2,000 నోట్లు మార్చుకుంటున్నారు వాటి మొత్తంను తెలపాలి.
ధ్రువీకరణ కార్డు గ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్టు, ఎంఎన్‌ఆర్‌జీఏ కార్డు లను చూపించవచ్చు , పై వాటిలో ఏదో ఒకటి గుర్తింపు పత్రం ఒరిజినల్ కాపీని బ్యాంకుకు చూపాల్సి ఉంటుంది. చివరగా డిపాజిట్ చేసే వ్యక్తి సంతకం చేయాలి. ఈ ప్రక్రియ ద్వారా బ్యాంకు ఖాతా వున్నా లేకున్నా నోట్లను మార్చుకోవచ్చు .
Share your comments