ఆధునిక యుగంలో ఏదయినా ఇట్టే మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకునే వీలును మనకు సెర్చ్ ఇంజన్ సంస్థలైన గూగుల్ ,మైక్రోసాఫ్ట్ సంస్థలు అందిస్తున్నాయి అయితే ఇప్పుడు టైపు చేయడం అవసరం లేకుండానే వాయిస్ రూపంలో ప్రశ్నలు అడిగి సమాధానం పొందే కొత్త AI (ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ) ద్వారా పనిచేసే చాట్ బోట్ లు ముందుకువస్తున్నాయి . దీనితో ఈ టైపు చేయడం వీలుకాని రైతులకు చేరువ చేయాలనీ కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది .
రైతులకు మొబైల్ వాడకం అంతగా తెలియదు. వాళ్లు ప్రతీదీ టైప్ చేసి అడగలేరు. అందువల్ల రైతులు తమ ప్రశ్నలను వాయిస్ రూపంలో అడగొచ్చు. వాటికి భాషిణీ టీమ్ వాట్సాప్ ద్వారా ఆన్సర్ ఇస్తుంది.
కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వశాఖ (MeitY)లో భాషిణీ అనే టీమ్ ఉంది. ఇది ప్రస్తుతం వాట్సాప్ ఆధారిత చాట్‌బోట్‌ని తయారుచేస్తోంది. ఇది చాట్‌జీపీటీ జెనరేట్ చేసే సమాచారంపై ఆధారపడి పనిచేస్తుంది. ఇది రైతులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తుంది. గ్రామాల్లో రైతులకు మొబైల్ వాడకం అంతగా తెలియదు. వాళ్లు ప్రతీదీ టైప్ చేసి అడగలేరు. అందువల్ల రైతులు తమ ప్రశ్నలను వాయిస్ రూపంలో అడగొచ్చు. వాటికి భాషిణీ టీమ్ వాట్సాప్ ద్వారా ఆన్సర్ ఇస్తుంది. ఇలాంటి ప్రాజెక్టుపై పని జరుగుతోంది.ఈ చాట్‌బోట్ 12 భాషలను సపోర్ట్ చేస్తోంది. వీటిలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ, కన్నడ, ఒడియా, అస్సామీ వంటి భాషలు ఉన్నాయి .
సోలార్ రూఫ్‌టాప్ పథకం.. కేంద్రం నుంచి భారీ సబ్సిడీ!
భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాటాప్ ప్రధానమైన సెర్చ్ ఇంజిన్‌గా మారే అవకాశం ఉంది. ఇండియాలోని 15 కోట్ల మంది రైతులు.. వాట్సాప్‌ని సెర్చ్ ఇంజిన్‌గా వాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Share your comments