News

ఇలా చేస్తే జైలుకే.. పీఎం కిసాన్ లబ్ధిదారులకు కేంద్రం హెచ్చరిక

KJ Staff
KJ Staff
pm kisan scheme
pm kisan scheme

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ ఈ పథకం ప్రవేశపెట్టగా.. ఇప్పటివరకు 8 విడతల సాయం చేసింది. ఈ పథకం ద్వారా రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తుండగా.. వీటిని విడతల వారీగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తుంది. అంటే సంవత్సరంలో నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున ఇస్తోంది

ఈ పథకం ద్వారా దేశంలో కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తుండగా.. ఈ సాయాన్ని రూ.10 వేలకు పెంచాలనే డిమాండ్లు ఉన్నాయి. అయితే కొంతమందికి అర్హత లేకపోయినా.. అడ్డదారిలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. దీంతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివిధ సంస్ధల ద్వారా స్క్యూటినీ నిర్వహించి అనర్హులను తొలగిస్తోంది.

కొంతమందికి అర్హత లేకపోయినా ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి ఈ పథకం ద్వారా డబ్బులు పొందుతున్నారు. ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి లబ్ధిపొందితే చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని తెలిపింది. ఇలాంటి వాళ్లు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది.

పీఎం కిసాన్ లబ్ధిదారుల్లో 4 శాతం మంది అనర్హులని గుర్తించి కేంద్ర ప్రభుత్వం.. గత ఏడాది ప్రారంభంలోనే వీరిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించింది. జార్ఖండ్ లో ఇటీవల ఇలాంటి కేసులు చాలా నమోదయ్యాయి. కొంతమంది ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నట్లు తేలింది. దీంతో వారిపై అధికారులు కేసు నమోదు చేశారు.

కాగా ఇటీవలే పీఎం కిసాన్ 8వ విడత డబ్బులను ప్రధాని మోదీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రతి ఏడాది తొలి విడత డబ్బులను ఏప్రిల్ 1 నుంచి జులై 31 మధ్య, రెండో విడత డబ్బులను ఆగస్టు 1 నుంచి నవంబర్ మధ్య, మూడో విడత డబ్బులు డిసెంబర్ లో ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటుంది.

Share your comments

Subscribe Magazine

More on News

More