రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యమని చెబుతున్న ప్రభుత్వాలు.. ఆ దిశగా ఆర్ధికంగా చేయూత అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. పీఎం కిసాన్, రైతు బీమా, పంట బీమా లాంటి అనేక పథకాలు ప్రభుత్వాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం క్రింద ఏడాదికి రూ.6 వేలు అందిస్తుండగా.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు బీమా అందిస్తున్నాయి. రైతు ప్రమాదాల వల్ల చనిపోతే కుటుంబానికి ప్రధానమంత్ర ఫసల్ బీమా పథకం ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సాయం కేంద్రం చేస్తోంది.
అలాగే రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో పథకం అమలు చేస్తోంది. ఈ పథకం పేరే కస్టమ్ ప్రాసెసింగ్ పథకం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వావలంబన భారత పథకం క్రింద దీనిని ప్రారంభించారు. ప్రస్తుతం ఫైలట్ ప్రాజెక్టు క్రింద మధ్యప్రదేశ్‌లో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. విడతల వారీగా దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ రైతులకు, యువతకు కేంద్రం రుణం అందిస్తుంది. ఈ రుణం ద్వారా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రభుత్వం నెలకొల్పవచ్చు.
ఈ పథకం కింద గ్రామీణ యువతకు గ్రేడింగ్, క్లీనింగ్, గ్రేడింగ్ ప్లాంట్, పల్స్ మిల్లు, రైస్ మిల్లు మొదలైన వాటికి రూ .25 లక్షల రుణం ఇస్తారు. అంతేకాకుండా ప్రభుత్వం 25 శాతం సబ్సిడీ కూడా అందజేస్తుంది. దీని వల్ల రైతులకు కూడా ఎంతో మేలు చేకూరుతుంది. రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రైతులు తమ పంట ఉత్పత్తిని గ్రేడ్ చేసి మార్కెట్‌లో అమ్ముకోవచ్చు.
మధ్యప్రదేశ్‌లో 250 కేంద్రాలను ప్రారంభించారు. త్వరలో దీనికి దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద ఆమోదం లభిస్తుంది. గ్రామస్థాయిలో రైతుల ఉత్పత్తులను గ్రేడింగ్ చేయడంతో పాటు గ్రేడ్ల ఆధారంగా మార్కెట్ లో అమ్ముకోవచ్చు.
రైతులు ఈ పథకం కింద అప్లై చేసుకోవడానికి వ్యవసాయ ఇంజనీరింగ్ డైరెక్టరేట్ లో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మధ్యప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో వీటిని ప్రారంభించనున్నారు. ఈ కస్టమ్ ప్రెసింట్ కేంద్రాలు తెరవడానికి కనీసం పది లక్షల రూపాయలు, గరిష్టంగా 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దీన్ని తెరవాలనుకునే రైతులకు రూ .10 లక్షల వరకు రాయితీ లభిస్తుంది.
Share your comments