ప్రభుత్వం వ్యవసాయంలో రసాయనాలను నిర్మూలించడానికి మరియు వ్యవసాయాన్ని సేంద్రీయంగా పకృతి సహజ సిద్ధంగా మార్చడానికి పరంపరగత్ కృషి వికాస్ యోజన అనే పథకం ద్వారా అన్ని రకాల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకం 2015లో మొదలైంది
ఈ పథకం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద, రైతులకు విత్తనాలు, బయో-ఎరువులు, బయో-పెస్టిసైడ్‌లు, సేంద్రీయ ఎరువు, కంపోస్ట్/ వర్మీ కంపోస్ట్, మొదలైన సేంద్రీయ వనరులకై హెక్టారుకు 3 సంవత్సరాలకు గాని రూ. 31000ల
ఆర్థిక సహాయం అందించబడుతుంది. అంతే కాకుండా రైతులు పండించిన సేంద్రీయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం కూడా ప్రభుత్వం అన్ని విధాలా సాయపడుతుంది .
అలాగే, రసాయన ఎరువులు కొంత కాలం వరకు ఉపయోగించడంలో నేల ఆరోగ్యంపై ఎటువంటి హానికరమైన ప్రభావం ఉండదు. కానీ నిరంతరంగా ఈ రసాయనిక ఎరువులు వాడితే దాని ప్రభావం కచ్చితంగా నేలపై మరియు పంటల దిగుబడిపై ఉంటుంది. ఎరువుల ప్రయోగాల'పై అఖిల భారత సమన్వయ పరిశోధన ప్రాజెక్ట్‌లో నిర్వహించిన పరిశోధనల ప్రకారం నత్రజనితో కూడిన ఎరువులను అధికంగా వినియోగించడం వల్ల పంట ఉత్పాదకతపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని సూచించాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర ల్ రీసెర్చ్ నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రసాయనిక ఎరువులను సమతుల్యాంగ ఉపయోగించడం కోసం మొక్కల పోషకాల యొక్క అకర్బన మరియు సేంద్రీయ ఎరువులను (ఎరువు, బయో-ఎరువులు మొదలైనవి) రెండింటినీ కలిపి ఉపయోగించడాన్ని సిఫార్సు చేస్తోంది. అంతే కాకుండా పప్పుధాన్యాల పంటలను పండించడం వంటి అంశాలను సూచిస్తుంది . ఈ అంశాలన్నింటిపై రైతులకు అవగాహన కల్పించేందుకు ICAR శిక్షణనిస్తుంది.
ప్రభుత్వం సమీకృత పోషక నిర్వహణ( ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్‌మెంట్ ))ను ప్రోత్సహిస్తోంది, ఇందులో కంపోస్ట్, వర్మి-కంపోస్ట్ , బయో-ఎరువులు మరియు సేంద్రీయ ఎరువులు వాడుతూ రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ ఉండాలి . తద్వారా నేలను పరిరక్షిస్తూ పంటల ఉత్పాదకతని పెంచవచ్చు.
మరిన్ని చదవండి
Share your comments