News

చిరుధాన్యాలు.. ఆరోగ్య సిరులు..

Gokavarapu siva
Gokavarapu siva

పూర్వం మన పూర్వికులు పంటలను పండించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ధాన్యాలు ఇప్పుడు మనం తింటున్న చిరు ధాన్యాలు. మనకు మళ్ళి పూర్వంల ఆరోగ్యవంతంగా జీవనం సాగించాలి అంటే ఈ చిరుధాన్యాలు తప్పనిసరిగా తినాలి. చిరుధాన్యాలను ప్రోత్సహించి, ప్రజలలో పోషకాహార లోపాన్ని నివారించడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అనేక పనులను చేస్తున్నాయి.

ఈ చిరుధాన్యాల ఉత్పత్తులను పెంచడానికి ప్రభుత్వాలు ద్రుస్తి పెట్టాయి. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో ఆంధ్ర ప్రదేశ్ తో పాటు మరో ఏడు రాష్ట్రాలలో మిల్లెట్ మిషన్లను ఏర్పాటు చెసినట్టు వెల్లడించింది. ఈ సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ దేశంలో చిరుధాన్యాల ఉత్పత్తి మరియు వాటి వినియోగంపై దృష్టిని కేంద్రీకరించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటున్నాయి.

కేంద్ర ప్రభత్వం భారతదేశాన్ని 2023-24 నాటికీ చిరుధాన్యాలకు గ్లోబల్ హబ్ గా తయారుచేసేందుకు ప్రణాళికలను తయారుచేసింది. ప్రస్తుతం కూడా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే అత్యధికంగా చిరుధాన్యాలను పండిస్తారు. సుమారుగా కేవలం మనదేశంలోనే 41 శాతం చిరుధాన్యాలను పండిస్తున్నారు. అనగా మన దేశంలో చిరుధాన్యాలు అనేవి 170.67 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు చిరుధాన్యాల యొక్క డిమాండ్ని మరియు ఉత్పత్తులను పెంచేందుకు దేశమో అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..

2023, అంతర్జాతీయ తృణ ధాన్యాల సంవత్సరానికి భారతదేశం నాయకత్వం వహిస్తుంది -ప్రధాని

ప్రజలకు ఈ చిరుధాన్యాలను ఉపయోగించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కలిగించడానికి ప్రభుత్వాలు కార్యక్రమాలను చేపట్టాయి. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు నుండి పాఠశాలలో రాగి జావ ఇవ్వనుంది. రైతులకు ఈ చిరుధాన్యాల పంటలను పండించేందుకు అవసరమైన సాంకేతికతను, పనిముట్లను, విధానాలను అందించి వారిని ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వాలు చిరుధాన్యాల ఉత్పాదకతను పెంచడం, వినియోగం, ఎగుమతి, విలువను బలోపేతం చేయడం, బ్రాండింగ్, సృష్టించడం వంటి వాటిపై దృష్టిని కేంద్రీకరించాయి. ఐఆర్సిటిసి రైళ్లలో కూడా చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి..

2023, అంతర్జాతీయ తృణ ధాన్యాల సంవత్సరానికి భారతదేశం నాయకత్వం వహిస్తుంది -ప్రధాని

Share your comments

Subscribe Magazine

More on News

More