కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వారి అవసరాలకు అనుగుణంగా అనేక పథకాలను అందుబాటులోకి తెస్తుంది. చాలా మంది వారి సొంత వ్యాపారాన్ని ప్రారంబించాలనుకుంటారు. అలాంటప్పుడు, మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు రుణం అవసరమా? ప్రధాన మంత్రి ముద్ర యోజన గురించి దాని రకాలు, అర్హత మరియు ఎలా దరఖాస్తు చేయాలి అనే దాని గురించి తెలుసుకోవలసిన ప్రతిదాన్ని తెలుసుకోండి. ప్రధాన మంత్రి ముద్రా యోజన అనేది చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలకు రుణాలను అందించే భారత ప్రభుత్వ పథకం. ఇది 2015లో ప్రారంభించబడింది.
కేంద్ర ప్రభుత్వం దేశంలో వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి 2015లో ఈ ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రజలు ఎలాంటి హామీ లేకుండానే ఈ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. మీరు కూడా మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే.. మీరు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ పూర్తి వివరాలను మనం ఇక్కడ తెలుసుకుందాం.
పీఎం ముద్రా రుణాలు మొత్తం మూడు రకాలు.
1. శిశు: రూ. 50,000/- వరకు రుణాలు
2. కిషోర్: రూ. 50,000/- మరియు రూ. 5 లక్షల వరకు రుణాలను కవర్ చేస్తుంది.
3. తరుణ్: రూ. 5 లక్షల కంటే ఎక్కువ విలువైన రుణాలను కవర్ చేయడం, అయితే రూ. 10 లక్షలకు మించకూడదు.
తరుణ్ లోన్ కోసం అప్లై చేస్తున్నప్పుడు లోన్ మొత్తంలో 0.50 శాతం (వర్తించే పన్నుతో పాటు) ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయబడుతుందని గమనించాలి. శిశు, కిషోర్ రుణాల విషయంలో అయితే ప్రాసెసింగ్ ఫీజు లేదు.
ఇది కూడా చదవండి..
పంజాబ్‌లో పెద్దఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్న రైతులు.. 12 చోట్ల రైలు నిలిపివేత..!
ఈ పథకంలో 24 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. లోన్ అప్లికేషన్ ద్వారా.. మీకు ఆధార్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, అడ్రస్ ప్రూఫ్ మొదలైనవి అవసరం. ఈ పథకం కోసం దరఖాస్తు చేయడానికి, అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఆపై ఫారమ్‌లో మొత్తం సమాచారాన్ని నమోదు చేసి, దానిని మీ సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంక్‌కు సమర్పించండి. అన్ని డాక్యుమెంట్‌లను పరిశీలించిన తర్వాత బ్యాంక్ మీ లోన్‌ను అప్రూవ్ చేస్తుంది.
అవసరమైన డాక్యుమెంటేషన్
1. గుర్తింపు యొక్క స్వీయ-ధృవీకరణ మరియు రుణ దరఖాస్తుదారు యొక్క రెండు పాస్‌పోర్ట్- ఫోటోలు
2. రుణదాత యొక్క రుణ దరఖాస్తు, దరఖాస్తుదారు పూర్తి చిరునామా , గత ఆర్థిక ఫలితాలు మరియు ప్రతిపాదిత ప్రాజెక్ట్ రిపోర్ట్
3. లేటర్ అఫ్ ఇంటెంట్ (వస్తువులు & కొనుగోలు సరఫరాదారులనుండి )
4 వ్యాపారం నిర్వహించే స్థలం యొక్క చిరునామా
5. వ్యాపార అవసరాలకు సరిపడు కొటేషన్
ఇది కూడా చదవండి..
Share your comments