News

పెరుగుతున్న ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. మొబైల్ వ్యాన్ ద్వారా తక్కువ ధరకే అమ్మకాలు

Gokavarapu siva
Gokavarapu siva

దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది దీనితో రానున్న రోజులలో టమాటో లగే ఇతర కూరగాయల ధరలు పెరగనున్నట్లు కొన్ని మార్కెట్ ఇంటలిజెన్స్ కమిటీలు అంచనా వేస్తున్నాయి. వంటకాల్లో అత్యంత ప్రాధాన్యత కల్గిన ఉల్లి ధరలు కూడా భారీగా పెరిగే అవకాశాలు వున్నాయి. భారీగా పెరగనున్న ఉల్లిపాయల ధరల నుండి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.

దేశ రాజధాని ఢిల్లీతో సహా పలు నగరాలు తమ నివాసితులకు సరసమైన ధరలకు ఉల్లిపాయలను అందించేందుకు చురుకైన చర్యలు చేపట్టింది కేంద్రం. ఉల్లిపాయలను ఢిల్లీ సహా అనేక నగరాల్లో మొబైల్ పాన్ ద్వారా ఉల్లిపాయలను తక్కువ ధరకు విక్రయించడానికి సిద్ధమవుతున్నాయి. 6 సెప్టెంబర్ 2023న వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే NCCF మొబైల్ వ్యాన్‌ను ప్రారంభించారు. దీని ద్వారా ప్రజలకు కిలో ఉల్లిపాయాలు కేవలం రూ. 25కి లభిస్తాయి.

ఉల్లి ధరల పెరుగుదలను నివారించడానికి, 12 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య పంపిణీ చేయడానికి ప్రభుత్వం దాని హోల్‌సేల్ బఫర్ స్టాక్ నుండి గణనీయమైన మొత్తంలో 36,250 టన్నుల ఉల్లిపాయలను విడుదల చేసింది. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED) మరియు నేషనల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (NCCFs) ఈ ఉల్లిపాయలను హోల్‌సేల్ మరియు రిటైల్ మార్కెట్‌లలో విక్రయించే కీలకమైన పనిని అప్పగించింది. ఈ రెండు ఏజెన్సీలను రైతుల నుండి నేరుగా 3 నుండి 5 లక్షల టన్నుల ఉల్లిపాయలను సేకరించాలని, తద్వారా ప్రస్తుత బఫర్ స్టాక్‌ను పెంచాలని కోరింది.

ఇది కూడా చదవండి..

రైతులకు గమనిక.. ఇక వీరి ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు రావు! ఇప్పుడే చెక్ చేసుకోండి!

ఆగస్టు 11 నుంచి ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, చండీగఢ్, కేరళ సహా 12 రాష్ట్రాల్లో 35,250 టన్నుల ఉల్లిపాయలు హోల్‌సేల్ మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. రిటైల్ మార్కెట్‌లో, ప్రభుత్వం ఉల్లిపాయలకు రూ.25 తగ్గింపు ధరను అందిస్తోంది, అయితే ఉల్లిపాయలు ఇప్పటికీ బఫర్ స్టాక్ నుండి వాటి సాధారణ ధరకే అమ్ముడవుతున్నాయి. రానున్న కాలంలో మొబైల్ వ్యాన్ల ద్వారా ఉల్లి లభ్యతను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

మరొకవైపు, దేశంలో ఉల్లి ధరలు పెరిగే అవకాశం ఉందని వివిధ మార్కెటింగ్ నిపుణుల విశ్లేషణ అనంతరం కేంద్ర ఉల్లి ధరలను నియంత్రణలో ఉంచడానికి ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఎగుమతి పన్ను విధించింది దీనితో ఇతర దేశాలకు ఎగుమతి తగ్గి ఉల్లి ధరలు తగ్గనున్నాయి అయితే ఎంతవరకు బాగానే వున్నా రైతులకు ఈ నిర్ణయం చాల నష్టాన్ని కల్గించనుంది.

ఇది కూడా చదవండి..

రైతులకు గమనిక.. ఇక వీరి ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు రావు! ఇప్పుడే చెక్ చేసుకోండి!

Share your comments

Subscribe Magazine

More on News

More