ఇప్పటికే ప్రారంభించబడిన వందే భారత్ రైలు లకు ఆదరణ పెరుగుతున్న క్రమంలో, మరికొన్ని రూట్ లలో వందే భారత్ రైలు లను నడపాలని కేంద్ర రైల్వే శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు, దానిలో భాగంగానే మరికొన్ని వందే భారత్ రైలు లను రెండు తెలుగు రాష్ట్రాలలో నడవున్నాయి.
ప్రస్తుతం విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్‌కు రెండు వందే భారత్ రైళ్లు రాకపోకలు కొనసాగుతున్నాయి.
అదేవిదంగా దుర్గ్-విశాఖపట్నం-దుర్గ్‌కు వందే భారత్ రైలువిశాఖకు రెండు వందే భారత్ రైళ్లు నడుపుతున్న సంగతి తెలిసిందే.
మూడో వందేభారత్ రైలు దుర్గ్-విశాఖపట్నం మధ్య నడిపేందుకు ఒడిశా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మీడియా కథనాలు మేరకు వున్న సమాచారం.
అదేవిదంగా గా మరో రైలు బెంగళూరు మరియు విజయవాడ మధ్య నడిపించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు అధికారులు. ఇదే కనుక జరిగితే ఆంధ్ర ప్రదేశ్ మరియు బెంగుళూరు మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది.
తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్‌కు డిమాండ్
తెలుగు రాష్ట్రాలలో వందే భారత్ రైళ్లకు మంచి డిమాండ్ ఉంది. రాను రాను ఈ రైళ్లలో ప్రయాణించేందుకు పాసింజర్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడిచే వందేభారత్ రైళ్లకు డిమాండ్ విపరీతంగా ఉంది. రోజు రోజుకు ఈ డిమాండ్ మరింత పెరుగుతోంది. అలాగే విజయవాడ - చెన్నై మద్య నడుస్తున్న వందేభారత్‌కు సైతం ఆదరణ లభిస్తుంది.
Share your comments