భారత దేశం మొత్తం ఎన్నికలు సందడి నడుస్తోంది. గత నెలలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్, పింఛన్ల మీద ప్రభావం చూపనుంది. గతంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, పింఛన్లను నేరుగా లభ్దిదారుల ఇళ్ల వద్దకే చేర్చేది. కానీ ఎన్నిక కోడ్ అమల్లోకి రావడం మూలంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్ పంపిణీకి బ్రేక్ పడనుంది.
అయితే పింఛన్ అందించడానికి ప్రభుత్వం ప్రతిమాన్యంగా, గ్రామా, వార్డు సచివాలయాలను రంగంలోకి దించనుంది. ఎన్నిక కోడ్ ఎత్తేసే వరకు అంటే మరో మూడు నెలల వరకు పింఛన్ గ్రామా, వార్డు సచివాలయాలు నుండి పింఛన్లను పొందవలసి ఉంటుంది. ఈ మేరకు కొత్త విధానం మార్గదర్శకాలను ఆదివారం గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ విడుదల చేసింది. సచివాలయం సిబంది, పింఛన్ దారుల, ఆధార్ కార్డు, ఐరిష్ వివరాలను నిర్ధారించి పింఛన్ అందచేస్తారు.
కొత్త ఆర్ధిక సంవత్సరం అమల్లోకి రావడం, మరియు బ్యాంకులకు వరుసగా సెలవలు రావడ కారణంగా, ఏప్రిల్ మూడో తారీకు నుండి పింఛన్ పంపిణి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, సచివాలయాలు వద్ద, వలంటీర్ల ప్రమేయం లేకుండా, కేవలం సచివాయల సిబంది మాత్రమే పెన్షన్ పంపిణి కొనసాగాలని సూచించింది. ఇంకా ఎప్పటిలాగానే, పింఛనుదారులు, తమ ఆధార్ కార్డు, ఐరిస్, ముఖ గుర్తింపు విధానంలోనే పింఛన్ పొందవచ్చు.
పింఛన్ పంపిణీ చేసే సమయంలో ఎటువంటి, పబ్లిసిటీ, ఫోటోలు, వీడియోలు, తియ్యడానికి వీలులేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పింఛన్ పంపిణి సజావుగా జరగడానికి, సచివాలయాలు వద్ద అదనపు, ఫింగర్ ప్రింట్ స్కేన్నర్స్ ఉంచబోతున్నారు. సచివాలయాలు వారీగా ప్రతిరోజు బ్యాంకుల నుండి ఎంత నగదు, తీస్తున్నారనే వివరాలను, మండల, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు నివేదిక అందించవల్సి ఉంటుంది. ప్రతి రోజు ఎంత మందికి నగదు అందించారు అన్న లెక్కల వివరాలు చూసుకునే బాధ్యత, వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీలు చేసుకోనున్నారు. ఎన్నికల కోడ్ పంపిణి నేపథ్యంలో ఆంక్షలు ఉన్నందున, బ్యాంకుల నుండి డబ్బు డ్రా చేసే భాధ్యతను, గ్రామ సచివాలయాల్లో, పంచాయితీ సెక్రటేరియట్తో పాటు, వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లకు అప్పగించారు.
Share your comments