News

వాతావరణ మార్పు... అరటి సాగుకు ముప్పు....

KJ Staff
KJ Staff


శరీరానికి అయ్యే అనేక పోషకాలు, ఖనిజాలు, మరియు అధిక శక్తిని ఇవ్వగలిగిన పండ్లలో అరటిపండు ఒక్కటి. ప్రయాణ సమయాల్లో మరియు జిమ్ములకు వెళ్లేవాళ్లకు అరటిపండు ఒక మంచి ఆహారం. మిగిలిన పళ్లతో పోలిస్తే అరటి పళ్ళ ధర తక్కువ. అరటి మొక్క భిన్న వాతావరణ పరిస్థుతలకు తట్టుకొని నిలబడగలడు. కానీ వేగంగా మార్పు చెందుతున్న వాతావరణ పరిస్థితులు, అరటి సాగుకు అడ్డు గోడగా మారుతున్నాయి. వాతావరణ మార్పులకు తోడు అరటి పండ్లకు వ్యాధులు కూడా వేగంగా వ్యాప్తి చెందుతూ, మరింత నష్టాన్ని చేకూరుస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా అరటి పళ్ళను దిగుమతి చేసుకొనే దేశాల్లో లండన్ ఒకటి. వాతావరణ మార్పులు మరియు ప్రబలమౌతున్న రోగాల కారణంగా లండన్ లో అరటి పళ్లకు తీవ్ర సంక్షోభం ఏర్పడింది. వరల్డ్ బనానా ఫోరమ్ కు చెందిన సీనియర్ ఎకనామిస్ట్ పాస్కల్ లియా, ఈ సంక్షోభానికి కారణాలు వివరించారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు మరియు వేగంగా వ్యాప్తి చెందుతున్న రోగాల కారణంగా అరటిపళ్ళ సరఫరా పై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు. అలాగే సప్లై చైన్ లో ఒడిడుకులు కూడా అరటిపళ్ళ కొరతకు కారణాలుగా లియూ తెలిపారు.

వేడెక్కుతున్న వాతావరణం మరియు అధిక తేమ, అరటి మొక్కల్లో రోగాలకు ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. అరటి మొక్కలను నాశనం చేసే ఫంగస్ లు ఒక మొక్క నుండి మరో మొక్కకు సోకడానికి వాతావరణ తేమ కారణం. అరటిలో వచ్చే తెగుళ్లను నివారించడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వీటన్నిటితో పాటు పెరుగుతున్న కూలీలా మరియు పంట యజమాన్య ఖర్చులు తోడై అరటి పళ్ళ ధరలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సమస్యకు వ్యవసాయ శాస్త్రజ్ఞులు, సమగ్రంగా కృషి చేసి వీలైనంత తొందరగా ఒక పరిస్కారాన్ని కనుగొనవలసి ఉంటుంది.

Share your comments

Subscribe Magazine

More on News

More