కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 25న రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2,000 జమ చేసింది. పీఎం కిసాన్ ఏడో విడత డబ్బుల ఇవి. ఇప్పటికే చాలా మంది ఈ డబ్బులను వారి బ్యాంక్ ఖాతాల్లోంచి విత్‌డ్రా చేసుకునే ఉంటారు.
పీఎం కిసాన్ రూ.2,000 వచ్చాయో లేదో ఇంకా కొంత మందికి తెలియకపోవచ్చు. అయితే పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయో లేదో అని సెకన్లలో తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లా్ల్సిన పని లేదు. ఇంట్లో నుంచే డబ్బులు వచ్చాయో లేదో సులభంగా తెలుసుకోవచ్చు.
దీని కోసం మీరు https://pmkisan.gov.in/beneficiarystatus.aspx దీనిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. ఆధార్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేవి ఇవి. వీటిల్లో ఆధార్ నెంబర్ ఎంచుకోండి.
మీకు పీఎం కిసాన్ స్కీమ్ రూ.2,000 డబ్బులు రావడం లేదా? అయితే మీరు ఒక పని చేయండి. టోల్‌ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయండి.
ఎవరికైనా పీఎం కిసాన్ డబ్బులు రాకపోతే వెంటనే ప్రభుత్వానికి ఫిర్యాదు చేసుకోవచ్చు. 011-24300606 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఒక్క నెంబర్ మాత్రమే కాకుండా పలు టోల్‌ఫ్రీ నెంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
PM Kisan Toll Free Number: 18001155266
Pm farmer helpline number: 011 2338240l
PM farmer landline numbers: 0ll 2338l092
PM Farmers of New Helpline: 011 24300606
Share your comments