News

PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి.... రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి....

KJ Staff
KJ Staff

తాజాగా జరిగిన లోకసభ ఎన్నికల్లో ఎన్డిఏ ప్రభుత్వం విజయఢంకా మోగించి, వరుసగా మూడోసారి విజయం సాధించింది. మూడో సారి ప్రధాన మంత్రి పీఠాన్ని అధిరోహించిన నరేంద్ర మోడీ, మొదటి సంతకం కిసాన్ సమ్మాన్ నిధి మీదే చెయ్యడం విశేషం. దేశంలోని రైతులకు సహాయంగా అందించే కిసాన్ సహాయ నిధులు 18, జులై, 2024 మంగళవారం, ఉత్తర ప్రదేశ్ వేదికగా రైతుల ఖాతాల్లోకి జమ చేసారు.

రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు 2018-2019 నుండి ఈ పథకాన్ని ప్రారంభించారు, ప్రతీ సంవత్సరం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో ఈ డబ్బును జమ చేస్తారు. ప్రతి విడతలో రూ.6000 పెట్టుబడి సహాయంగా అందిస్తుంది కేంద్రం. తోలి విడత మే-జూన్ మాసంలో ఇస్తే రెండొవ విడత అక్టోబర్-నవంబర్ మరియు మూడోవ విడత జనవరి-ఫిబ్రవరి మాసాల్లో పెట్టుబడి సహాయం అందిస్తారు. ఈ పథకం ప్రారంభించిన నాటి నుండి ఇప్పటివరకు మొత్తం 16 విడతల్లో డబ్బు విడుదల చెయ్యగా, మొత్తం మూడు లక్షల కోట్లకు పైగా నిధులను ఈ పథకం కోసం వ్యాచించారు.

2024-25 ఆర్ధిక సంవత్సరం మొదటి విడత కోసం 870 కోట్ల రూపాయిలు నిధులను ఖర్చు చేసారు. మరోపక్క మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఖరీఫే పనులు ప్రారంభమయ్యాయి, ఈ నిధుల రైతులకు చేయూతగా మారనున్నాయి.

అయితే ఈ పధకం ద్వారా లభ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు నేరుగా జమచేయనున్నారు, కానీ కేవైసి పూర్తి చెయ్యని రైతులకు ఈ నగదు సహాయం అందదు, అంతేకాకుండా సరైన పత్రాలు లేని వారిని మరియు మరణించిన వారిని కూడా అర్హుల జాబితా నుండి తొలగించడం జరిగింది. ఈ తొలగింపు ప్రక్రియలో కొన్ని తప్పిదాల కారణంగా అర్హుల పేర్లను కూడా తొలగించవచ్చు కాబట్టి రైతులు వారి వివరాలు జాబితాలో ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఒకేవేళ అన్ని అర్హతలు ఉంది మీ అకౌంట్ లోకి డబ్బు జమ కానున్నట్లైతే పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ లోకి వెళ్లి మీ స్టేటస్ ని నిర్ధారించుకోండి.

దీని కోసం https://pmkisan.gov.in/ ఈ వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ ఫార్మర్ కార్నర్ పై క్లిక్ చేసి, నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి. అక్కడ మీ రిజిస్ట్రేషన్ కోడ్ మరియు అక్కడ ఇచ్చిన క్యాప్ట్చ ఎంటర్ చెయ్యాలి, ఇప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చెయ్యగానే లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది, దానిలో మీరు పేరు ఉందొ లేదో చుడండి. మీ పేరు గనుక నమోదుకానట్లైతే వెంటనే అన్ని ధ్రువ పాత్రలను తీసుకోని సంబంధిత అధికారిని కలవండి.

Related Topics

#PM Kisan #NDA #CropInvestment

Share your comments

Subscribe Magazine

More on News

More