ఈ ఏడాది మిర్చి పంటకు మంచి ధర రావడంతో మంచి రకం విత్తన ధరలను రెట్టింపు చేసాయి విత్తన కంపెనీలు మంచి రకం విత్తనాలకు కిలో రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు పలుకుతోంది. మరోవైపు అడ్వాన్సు బుకింగ్ పేరుతో వాటి ధరల్ని రెట్టింపు చేశారు.
రైతులు వచ్చే ఏడాది అధిక విస్తీర్ణంలో మిరపను సాగుచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ సంవత్సరం మిర్చి ధరలు అధిక ధర పలకడంతో రైతులు అధిక మొత్తంలో మిర్చిని సాగు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ,ఇప్పుడు రైతుల ద్రుష్టి అంత విత్తన కొనుగోలు పై వుంది మంచి రకం నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి అధిక ఆదాయం పొందాలని రైతులు చూస్తుండడం తో విత్తన కంపెనీ లు ధరను పెంచేసాయి సాధారణంగా జూన్, జులైలో మిరప నారు పోస్తారు. ఆగస్టు, సెప్టెంబరులో మొక్కలు నాటుతారు. విత్తన అమ్మకాలు మే నెలలో మొదలవుతాయి. మిరప ధరలు క్వింటాలు రూ.20 వేల నుంచి రూ.50వేల వరకు పలుకుతున్నాయి. కొన్ని రకాలు నల్లతామరను తట్టుకోవడంతో ఎకరాకు 20-30 క్వింటాళ్ల దిగుబడి లభించింది.
ఇది కూడా చదవండి .
పడిపోయిన ధరలు.. నష్టాల్లో రైతులు
నల్ల తామర నివారణ :
పురుగు సోకిన ఆకులు పడవ ఆకారంలో ముడుచుకుంటాయి. ఈ పురుగు నివారణకు గాను స్ప్రేనోటెరామ్ 11.7 ఎస్సీ @ 10 మి.లీ లేదా స్పినోసాడ్ 45 ఎస్సీ @ 3 మి.లీ లేదా ఫిప్రోనిల్ 5 ఎస్సీ @ 20 మి.లీ లేదా సయాంట్రానిలిప్రోల్ 10 ఓడీ @ 3 మి.లీ 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చేయాలి.లేదా సంబంధిత వ్యవసాయ అధికారిని సంప్రదించి సరైన మందును వినియోగించాలి .
Share your comments