ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ సృష్టికర్త చైనా దేశమేనని అన్ని దేశాలు చైనా పై తీవ్ర విమర్శలు కురిపిస్తున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం వీటన్నింటిని పట్టించుకోకుండా తమ పనిలో వారు నిమగ్నమై అధిక ఫలితాలను పొందుతున్నారు. తాజాగా చైనా అంతరిక్షంలోకి వరి ధాన్యాలను పంపి అక్కడినుంచి వాటిని తీసుకువచ్చి వరి సాగు చేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.
గత ఏడాది నవంబర్ నెలలో చైనా దేశం చాంగ్ 5 రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపింది. ఈ రాకెట్లో వరి విత్తనాలను కూడా పంపించింది. ఈ వడ్లు కాస్మిక్ రేడియేషన్‌తో పాటు సున్నా గురుత్వాకర్షణకు గురైన తర్వాత వాటిని తిరిగి భూమి పైకి తీసుకువచ్చి ఆ విత్తనాలతో పంటను సాగు చేస్తూ అధిక దిగుబడి పొందుతున్నారు.ఈ రాకెట్ ద్వారా నిపుణులు మొత్తం 400 గ్రాముల బరువు ఉన్న 1500 వరి విత్తనాలను అంతరిక్షంలోకి పంపారు.
అంతరిక్షంలో ఉన్న మార్పుల కారణంగా ఈ విత్తనాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ విధంగా భూమి పైకి వచ్చిన ఈ విత్తనాలను దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నాటారు. అదేవిధంగా గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ విత్తనాలపై పరిశోధనలు జరిపారు. ఈ క్రమంలోనే ఈ స్పేస్ రైస్ ఒక్కొక్కటి ఒక్కో మీటరు పొడవు ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. అయితే చైనా ప్రభుత్వం ఈ విధంగా అంతరిక్షంలోకి విత్తనాలను పంపడం ఇదే మొదటిసారి కాదు ఇప్పటివరకు సుమారు 200 పరకాల విత్తనాలను అంతరిక్షంలోకి పంపే ప్రయోగాలను చేసినట్లు తెలిపారు.
Share your comments