మహబూబాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆకెరవాగు నది వరద నీటిలో మునిగిన సీతారాం తండాలో వరద నష్టాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలతో ఆయన మాట్లాడారు.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, తదితరులతో కలిసి వచ్చిన సీఎం నష్టాన్ని అంచనా వేసి వరద బాధితులకు సహాయ ప్యాకేజీని ప్రకటించారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ.10వేలు పరిహారం ప్రకటించి, ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు.
అంతకుముందు పురుషోత్తమయ్యగూడెం గ్రామం వద్ద ఆకెరవాగు నదిపై దెబ్బతిన్న వంతెనను సీఎం పరిశీలించారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ ఉన్నారు.
వరద నష్టాన్ని అంచనా వేసి బాధిత కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా సీఎం పర్యటన సాగింది. ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి జీవితాలను పునర్నిర్మించేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందజేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
తెలంగాణ లో భారీ వర్షాల కారణంగ ఇప్పటి వరకు దాదాపు 16 మంది మరణించినట్లు ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి .
Share your comments