ఎన్ టి ఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు రైతుల రుణ భారాన్ని మరియు వ్యవసాయ రంగంలో పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకుని పంటలవారీగా రుణ పరిమితి (స్కేల్ అఫ్ ఫైనాన్స్ ) నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మరియు కేడీసీసీ బ్యాంకు అధికారులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో స్కేల్ అఫ్ ఫైనాన్స్ పై జిల్లా స్థాయి సాంకేతిక కమిటి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది స్కేల్ అఫ్ ఫైనాన్సును గత రెండు సంవత్సరాలలో నిర్ధారించిన పంటల రుణ పరిమితి (స్కేల్ అఫ్ ఫైనాన్స్) జిల్లాలో ప్రధానంగా రైతులు పండిస్తున్న పంటలు, ఎకరాకు రైతుకు అయ్యే ఖర్చు, దిగుబడి ఆధారంగా నిర్ధారించింది.
ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ నాబార్డ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి ఏడాది జిల్లాలో పండించే పంటలకు ఎంతవరకు ఫైనాన్స్ చేయవచ్చనే దానిపై రైతులకు నష్టం కలగకుండా, పంట దిగుబడి ఖర్చుల ఆధారంగా స్కేల్ అఫ్ ఫైనాన్స్ నిర్ధారిస్తానన్నారు.
స్కేల్ అఫ్ ఫైనాన్స్ అంచనా వివరాలను రాష్ట్ర స్థాయి కమిటీకి బ్యాంకర్లు మరియు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారుల సలహాలు, సూచనలు వివిధ పంటలకు రూపొందించి పంపిస్తామన్నారు.
ఇది కూడా చదవండి
AP లో రైతులకోసం కొత్తగా 680 ఆగ్రో రైతు సేవ కేంద్రాలు ..
అన్ని జిల్లా నుంచి అందిన సమాచారం ఆధారంగా రాష్ట్ర స్థాయి కమిటీ పంట రుణాల మొత్తని నిర్ధేశిస్తుందన్నారు. స్కేల్ అఫ్ ఫైనాన్స్ నిర్ధేశించే సమయములో ఎకరాకు రైతు కూలీలు, ఎరువులు, క్రిమిసంహారక మందులకయ్యే ఖర్చులు పరిగణలోకి తీస్కుని నిర్ధారణ జరగాలని కలెక్టర్ అన్నారు.
సమావేశంలో కేడీసీసీ బ్యాంకు సీఈవో ఏ . శ్యమ్ మనోహర్ , జనరల్ మేనేజర్ బి.ఎల్ చంద్రశేఖర్, ఎల్డిఎమ్ కోటేశ్వరరావు జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎం. విజయభారతి , జిల్లా ఉద్యన శాఖ అధికారి బాలాజీ కుమార్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. నాగ రాజా అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి
Share your comments