మహబూబాబాద్ జిల్లాలో 2023-24వ సంవత్సరం లో వేసే ఖరీఫ్ పంట లో వరి రకం 1001 ని రైతులు సాగు చేయవద్దని జిల్లా కలెక్టర్ కె. శంకర్ వ్యవసాయ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసినట్టు నివేదికల సమాచారం
దీనికి కారణం ఎంటంటే , రైతులు పండిస్తున్న 1001 రకం , దొడ్డు రకం కావడం వలన రా రైస్ క్వింటా కు 70 % రావట్లేదని రైస్ మిల్లర్ల అసోసియేషన్ సంఘం మొర పెట్టుకుంటుంది. దీని వళ్ళ తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైస్ మిల్లర్లు సంగం కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. విషయం పై విచారణ జరిపిన కలెక్టర్, 1001 వరి రకాన్ని రైతులు సాగు చేయొద్దు అని ఆదేశాలు జరీ చేసారు.
వ్యవసాయ అధికారులు ద్వారా,గ్రామాల్లో రైతులు 1001 వారి రకం వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని , ఈ నెల 12 నుండి స్పష్టమైన ఆదేశాలు పంపమని , విత్తన షాపుల్లో వరి 1001 రకం విత్తనాలు విక్రయం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అయితే రైతులు ఈ దొడ్డు రకం వరి పై మక్కువ చూపడానికి కారణం లేకపోలేదు. సన్న రకం వరి సాగు వల్లన చిన్నకారు రైతులు ఎక్కువ పెట్టుబడి తో తక్కువ దిగుబడి వచ్చి, నష్టాలను చూడాల్సి వస్తున్నదని రైతులు చెప్తున్నారు. ఇప్పుడు దొడ్డు రకం పై నిషేధాలు విధిస్తే , కౌలు మరియు చిన్న , మధ్య రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రైతులు విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి
Share your comments