News

పేరుకు మొక్క జొన్న పంట .. తీరా చుస్తే ?

Sriya Patnala
Sriya Patnala
Man in Gujarat arrested for growing ganja in disguise as corn crop
Man in Gujarat arrested for growing ganja in disguise as corn crop

ఈజీ మనీ- అంటే కష్టం లేకుండా డబ్బులు సంపాదించడం. ఈ ధోరణకు అలవాటు పడి కొందరు అక్రమ మార్గాల వైపు మగ్గు చూపుతున్నారు. అలాంటి ఒక వ్యక్తి చేస్తున్న పని తాజాగా వెలుగులోకి వచ్చింది

గుజరాత్‌లోని పంచమహల్ జిల్లా షెహ్రా తాలూకా బోరియా గ్రామంలో మొక్కజొన్న సాగు చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.తీరా తెలిసింది ఏంటంటే .. గ్రామంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ బస్ కండక్టర్ శంకర్ మావ్జీభాయ్ దోడియార్ , తన ఇంటి సమీపంలో ఉన్న పొలంలో మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. అది బయట అందర్నీ మభ్యపెట్టడానికే.అతను లోపల సీక్రెట్‌ గా సాగు చేసేది పక్కా నాటు గంజాయి. ఈ సమాచారం స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అధికారులకు అందింది. దీంతో అకస్మాత్తుగా ఆ పొలంలో దాడులు చేశారు.

పొలంలో సాగు చేసిన దాదాపు 33 పచ్చి గంజాయి మొక్కల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయి బరువు 54.72 కిలోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సరుకు విలువ రూ.5.47 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి.. రిమాండ్‌కు తరలించారు.

ఇది కూడా చదవండి

గేదెను కరిచిన పిచ్చి కుక్క... పాలు తాగిన దూడ మృతి ..అవే పాలు తాగిన 300 మంది

(Source)

Related Topics

#viralnews #gujarat

Share your comments

Subscribe Magazine