News

పూర్తయిన సర్వే .. పంట నష్టపోయిన రైతుకు త్వరలో ఎకరానికి రూ . 10 వేలు!

Srikanth B
Srikanth B

గత నెలలో కురిసిన అకాల వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా భారీగా పంట నష్టం వాటిల్లింది .. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ . 10 వేలు కేటాయించిన ప్రభుత్వం ఈమేరకు వరంగల్ జిల్లాలో సర్వే పూర్తి చేసింది .

గత మార్చి 18, 19 తేదీ ల్లో కురిసిన అకాల వర్షానికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలలో పంట నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే .. అకాల వర్షాల తరువాత పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ . 10 వేలు నష్ట పరిహారం ప్రకటించింది ప్రభుత్వం , ఇ మేరకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అధికారులు క్షేత్ర స్థాయిలో పంట నష్టం పై సర్వే నిర్వహించారు రైతులు ఏ సర్వే నంబర్‌లోని భూమిలో ఎంత పంట కోల్పోయారు అనే వివరాలు సేకరించారు.


18, 19 తేదీల్లో కురిసిన వర్షానికి సుమారు 69 వేల ఎకరాల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు అధికారులు . ప్రస్తుతం ప్రత్యేక బృందాలు, వ్యవసాయశాఖ అధికారులు సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఇది పూర్తయితే ప్రభుత్వానికి జిల్లా నుంచి పంట నష్టంపై సర్వే నివేదిక అందనుంది. ఈ జాబితాలోని రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం పంపిణీ మొదలు కానుంది.

గుంటూరు మిర్చి యార్డులో భారీగా తగ్గిన మిర్చి నిల్వలు ..

12 వేల ఎక రాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు , మరో మూడు వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మామి డి, మిరప, అరటి, డ్రాగన్‌ ఫ్రూట్స్‌ తోటలతో పాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు సర్వే ద్వారా నిర్దారించారు . ఈ నేపథ్యంలో అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకొనేందుకు ప్రభుత్వం పంట నష్టంపై సర్వేకు ఆదేశించింది. మార్గ దర్శకాలను జారీ చేయడంతో మార్చి 22 నుంచి అధి కారులు సర్వేకు ప్రణాళిక రూపొందించారుసర్వే పూర్తి కావడంతో ప్రస్తుతం ప్రత్యేక బృం దాలు, వ్యవసాయశాఖ అధికారులు వివరాలను ఆన్‌ లైన్‌లో ఎంట్రీ చేస్తున్నారు.ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వే నిర్వహించి , త్వరగా నష్ట పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు .

గుంటూరు మిర్చి యార్డులో భారీగా తగ్గిన మిర్చి నిల్వలు ..

Share your comments

Subscribe Magazine

More on News

More