విజయవాడ నగరంలో కొత్తగా సిమ్ కార్డుల దందా బయట పడింది. ఈ సంఘటన గుణదలలో జరిగింది. ఇక్కడ ఏకంగా కేవలం ఒకే ఫొటోతో 658 సిమ్ కార్డులు జారీ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్ అందిన కంప్లైంట్ మేరకు విచారణ జరపాలని సూర్యారావుపేట పోలీసులను ఆదేశించారు. ఈ విచారణలో తెలిసింది ఏమిటంటే ఒక నెట్వర్క్ సంస్థకు ఒకే ఫొటోతో 658 సిమ్ కార్డులను అమ్మినట్లు తెలిపారు.
విజయవాడ నగరం గుణదలలో సత్యనారాయణపురానికి చెందిన పోలుకొండ నవీన్ అనే యువకుడు ఒకే ఫొటోతో 658 సిమ్‌కార్డులు పొందాడు. ఇన్ని సిం కార్డులను ఒకే ఫొటోతో నవీన్ రిజిస్టర్ చేసినట్లు విచారించిన పోలీసులు తెలిపారు. అదేవిధంగా అజిత్సింగ్ నగర్, విస్సన్నపేట పోలీస్స్టేషన్ల పరిధిలో మరో 150 వరకు సిమ్ కార్డులను ఫేక్ డాకుమెంట్స్ తో జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సిం కార్డు మోసాలన్నీ కృత్రిమ మేధస్సు సహాయంతో బయట పడింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్ ఈ సిం కార్డు మోసాలను నివారించడానికి ఒక టూల్‌కిట్ కనిపెట్టారు. ఈ టూల్‌కిట్ అనేది కృత్రిమ మేధస్సుతో పనిచేస్తుంది. సదరు ఏఐ టూల్ కిట్ వడపోతలో ఈ విషయం వెలుగుచూసింది.
ఇది కూడా చదవండి..
రైతులకు జగన్ శుభవార్త..నెలలోపే పంట నష్ట సాయం అందించనున్న ప్రభుత్వం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫేసియల్ రికగ్నేషన్ పవర్డ్ సొల్యూషన్ ఫర్ టెలికాం సిమ్ సబ్‌స్క్రైబర్ వెరిఫికేషన్ సాఫ్ట్‌వేర్ ద్వారా సిమ్‌కార్డు మోసాలను గుర్తించి, సంబంధిత నంబర్లను బ్లాక్ చేస్తోందని తెలిపారు. అన్ని టెలికాం ఆపరేటర్ల నుంచి సిమ్‌కార్డుదారుల చిత్రాలను తీసుకుని వడపోస్తుంది. నకిలీ పత్రాలతో జారీ అయిన సిం కార్దులు క్కడికి వెళ్లాయి, ఎవరు వాటిని వాడుతున్నారు అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments