తెలంగాణాలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారిపోతున్నాయి , ఇంకా కొన్ని నెలలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది ..రానున్న ఎన్నికలే లక్ష్యంగా ఎన్నికల డిక్లరేషన్లను ప్రకటించుకుంటూ పోతుంది ఇప్పటికే రైతులను అక్కటుకునేలా వరంగల్ డిక్లరేషన్ లో రైతులకు 2 లక్షల రుణమాఫీ తో పటు రైతులకు ఇప్పడి ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు ను పదివేల నుంచి 15 పదిహేను వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది.
తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ చరిత్రలో మరపురాని రోజుగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ఆరు హామీలకి శ్రీకారం చుడుతున్నట్లు ఇటీవల ప్రకటన సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
రైతు భరోసా కింద రూ.15 వేలు పెట్టుబడి సాయం. కౌలురైతులకు రూ.12 వేలు సాయం. వరికి మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్. వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్. ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. ప్రజా సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేశాం. ఉపాధిహామీ చట్టం చేసింది కాంగ్రెస్సే. ఆహార భద్రత చట్టం చేసి ప్రజల ఆకలి తీర్చింది కాంగ్రెస్ అని ఖర్గే అన్నారు.
ఇది కూడా చదవండి..
ప్రభుత్వం సంచలన నిర్ణయం.. కర్ణాటకలో వాళ్లందరికి రేషన్ కార్డు రద్దు!
ఉపాధి హామీ పథకంలో పేరు నమోదు చేసుకున్న భూమి లేని రైతుకూలీలకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తాం'' అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కౌలు రైతులకు బుధవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని 22 లక్షల మంది కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి రైతుబంధు, పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం. అందడం లేదన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments