రైతు సమస్యలను కూడా మానవ హక్కుల ఉల్లంఘన సమస్యలుగా పరిగణించాలని , ధరణిలో తలెత్తిన సమస్యలను కారణంగా రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారని ప్రభుతం పై మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు చేసారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు .. ప్రభాకర్ కోదండ రెడ్డి, అన్వేష్ రెడ్డి పొన్నం ఫిర్యాదు చేశారు. ధరణి సమస్యలతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హెచ్ఆర్సీ దీనిని పరిగణలోకి తీసుకొని రైతు సమస్యలను పరిష్కరించాలని కోరారు .
రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ.. వస్తావా హక్కుదారులకు ప్రభుత్వం నుంచి లబ్ది పొందలేదని .. ధరణి వచ్చిన తరువాత రైతుల సమస్యలు మరింత జటిలం అయ్యాయని .. వాటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం మాత్రం పాటించుకోకుండా అలసత్వం ప్రదర్శిస్తుందని .. రైతులు ఇబ్బందులు చూడలేకనే హెచ్‌ఆర్సీకి పిర్యాదు చేశామని తెలిపారు .
పత్తి రైతులకు హెచ్చరిక: పత్తి నిల్వతో బాధ పడుతున్న రైతులు..
ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భూ పోరాటాలకు తెలంగాణ పెట్టింది పేరని, ఊరు గొప్ప పేరు దిబ్బలా ధరణి పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ధరణి సమస్యపై వేల అప్లికేషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ధరణి సమస్యపై ఛీఫ్ సెక్రటరీకి, ముఖ్యమంత్రి ల దృష్టికి పలు సార్లు తీసుకువెళ్లామన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో.. రాష్ట్ర హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశామన్నారు. జాతీయ హెచ్ఆర్సీకి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. కాంగ్రెస్ భూములు పంచిపెడితే.. భూధాన్ భూములను హెచ్‌ఎండీఏ అమ్ముకుంటోందని కోదండ రెడ్డి అన్నారు.
Share your comments