ఆధునిక ప్రపంచంలో, మొబైల్ ఫోన్ హ్యాకింగ్ ప్రమాదం బాగా పెరిగింది. ఫోన్ కాల్‌లు, ఆన్‌లైన్ లావాదేవీలు చేయడం మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను వాడటం వంటి రోజువారీ కార్యకలాపాలు మన జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి. వీటిని అవకాశంగా చేసుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.
నేటికాలంలో కొత్త తరహా మోసాలు బాగా పెరిగిపోయాయి. ప్రస్తుతం అయితే మీరు ఇంకా మీ ఇంటి కరెంటు బిల్లు కట్టలేదని మెసేజ్లు పంపుతున్నారు. ఆ మెసేజ్ లో కరెంటు బిల్లు కట్టడానికి ఒక లింక్ ను పంపుతున్నారు, ఆ లింక్ ఓపెన్ చేసి మీ ఇంటి యొక్క విద్యుత్ బిల్లును చెల్లించాలని, లేదాంటే ఇంటికి విద్యుత్ నిలిపివేయబడుతుంది అని మెసేజ్ పంపుతున్నారు.
మిరుకనుక ఆ మెసేజ్ నిజమని నమ్మి ఆ లింక్ ని క్లిక్ చేశారో మీ ఖాతాల్లో డబ్బులు మాయమవడం ఖాయం. మీరు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారని తెలుసుకోండి. ఇటీవలి కాలంలో సైబర్ మోసాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా వెలుగుచూసిన ఘటనను చూస్తే మతిపోతాది. అసలు ఈవిధంగా కూడా మోసాలు జరుగుతాయా అని ఆశ్చర్యపోతారు. దాని గురించి పూర్తగా మనం తెలుసుకుందాం.
విద్యుత్ శాఖ నుంచి మెసేజ్ పంపించినట్లుగా ఓ మెసేజ్ చేస్తారు. అందులో ఏముంటుందంటే.. డియర్ కన్స్యూమర్.. మీరు గత నెల చెల్లించిన బిల్లు అప్డేట్ కాలేదు. ఈ రోజు నుంచి మీ ఇంటికి విద్యుత్తును నిలిపివేస్తామని ఉంటుంది. దయచేసి బిల్లు వెంటనే చెల్లేంచేందుకు ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి అంటూ మెసేజ్ లతో మోసాలు వెలుగుచూస్తున్నాయి.
ఇది కూడా చదవండి..
సామాన్యులకు శుభవార్త.. త్వరలో తగ్గనున్న పాల ధరలు..
విజయవాడకు చెందిన ఒక డాక్టర్ కి ఇటీవలి ఇలాగే అతని ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది. ఆ వైద్యుడు బిల్లు చెల్లిదామని ఈ లింక్ క్లిక్ చేసాడు. ఆ తర్వాత వెంటనే అతని ఖాతా నుండి రూ.60 వేలు డెబిట్ అయ్యాయి. ఇలానే ఇంకొక వ్యక్తికి కూడా మెసేజ్ వెళ్ళింది, ఆ లింక్ క్లిక్ చేయగానే రూ. 21 వేలు ఖాతా నుండి పోయాయి.
ఈ తరహా సైబర్ మోసాలను బాధిత వ్యక్తులు విద్యుత్ అధికారుల ద్రుష్టికి వెళ్లగా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. విద్యుత్ అధికారులు ఈవిధంగా బిల్లులు చెల్లించమని ఎవరికీ కాల్స్ లేదా మెసేజ్లు పెట్టారని తెలిపారు. అటువంటి లింక్స్ క్లిక్ చేసేముందు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
అలాంటి లింక్ లను ఓపెన్ చేస్తే మీ ఫోన్ నెంబర్ కు బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉండటం వల్ల సైబర్ నేరస్తులకు మీ బ్యాంక్ అకౌంట్ డిటేయిల్స్ వెళ్లి, వారు మనీ కాజేసేందుకు అవకాశం ఉందంటూ చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments