News

దేశం లో పెరుగుతున్న కరోనా చైనా వేరియెంట్ కేసులు !

Srikanth B
Srikanth B
Corona China variant
Corona China variant

దేశం లో పెరుగుతున్న కరోనా చైనా వేరియెంట్ కేసులు !

కొత్త సంవత్సరానికి ముందు చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రజలను భయాందోళనలనుకు గురి చేస్తుంది , ఏకంగ నిన్న ఒక రోజులోనే 3 కోట్ల వరకు కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి అంటే చైనాలో పరిస్థితి ఏ విధముగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు , గత రెండు రోజుల క్రితం మన దేశంలో కూడా చైనా కొత్త వేరియంట్ కేసులు 4 వరకు అయ్యాయి .

 

 

ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్.7 (BF.7) నెమ్మదిగా వ్యాప్తి చెందుతోంది. అన్ని దేశాల్లోనూ ఇది కనిపిస్తోంది. మన దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి కేసులు నాలుగు వెలుగుచూశాయి. అలాగే, గత 24 గంటల్లో 201 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, రికవరీ రేటు 98.8 శాతం ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది .

మరోవైపు, తూర్పు ఆసియా దేశాలన్నీ చైనా భయంతో అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణకులకు విమానాశ్రయాల్లోనే పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాయి. భారత ప్రభుత్వం కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శుక్రవారం రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమావేశమయ్యారు. కొవిడ్ సన్నద్ధతపై సమీక్షించారు.

గోల్డెన్ బ్లడ్ గ్రూప్ గురించి ఎప్పుడైనా విన్నారా ?

దీనితో అప్రమత్తమైన భారత ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది .. కరోనా వైరస్ ఏ సమయంలో అయినా విజృభిస్తే దానికి సిద్ధముగా ఉండాలని జిల్లాధికారులను ఆదేశించింది దీనితో రాష్ట్రము లోని అన్ని జిల్లాలకుఆ ఆదేశాలు వెళ్లాయి . కరోనా వైరస్ ఒక వేళా విజృంభిస్తే గతంలో మాదిరిగా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు అనుసరించిన టెస్ట్‌, ట్రేస్‌, ట్రీట్‌మెంట్‌ విధానాన్ని పకడ్బందీగా అమలుచేయాలని సూచించింది.

ప్రస్తుతం గ్రామీణ జిల్లాలో కొవిడ్‌ పరీక్ష గురించి పట్టించుకోవడమే లేదు. అర్బన్‌ పరిధిలో కేజీహెచ్‌తోపాటు మరో ఐదు నుంచి ఆరు అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌లో ఆ సౌకర్యం ఉంది. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను పెంచే దిశగా అధికారులు దృష్టిసారించారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా జిల్లాల్లోనూ పటిష్ఠమైన చర్యలు తీసుకుని కొవిడ్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోనున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది .

గోల్డెన్ బ్లడ్ గ్రూప్ గురించి ఎప్పుడైనా విన్నారా ?

Share your comments

Subscribe Magazine

More on News

More