AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా పౌరుల ఆధార్ కార్డులలో మార్పులకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది . సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి జాప్యం జరగకుండా .. ప్రతి పౌరుని ఆధార్ కార్డులో కొత్త జిల్లాల పేర్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
AP New Districts: ఆధార్ కార్డుల్లో కొత్త జిల్లాల పేర్లు వచ్చేది అప్పటి నుంచే!
AP New Districts: ఈ ఏడాది ఉగాది నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు అమలులోకి వచ్చాయి. 13 జిల్లాల రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా ప్రభుత్వం మార్చింది . ఆ తర్వాత మంత్రి మండలిలోనూ మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం.. సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకోనున్నారు .
దీంతో ఏపీలోని ప్రతి పౌరుని ఆధార్ కార్డులో జిల్లాల పేర్లను మార్చడం అనివార్యంగా మారింది. అయితే పాత జిల్లాల పేర్ల స్థానంలో కొత్త జిల్లాల పేర్లను చేర్చే విషయంపై మంగళవారం సమావేశం నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ సీసీఎల్ఏ కార్యదర్శి బాబు వెల్లడించారు.
ఏపీలోని ప్రతి పౌరుని ఆధార్ కార్డులో మండలం, పిన్ కోడ్ మ్యాపింగ్ చేసి.. వాటితో ఆధార్ లో మార్పులు చేస్తే కొత్త జిల్లాల పేర్లు మారేలా చేయవచ్చని సీసీఎల్ఏ కార్యదర్శి బాబు తెలిపారు. దీన్ని అమలు చేసిన తర్వాత ప్రజల నుంచి ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరించి మార్పు చేర్పులు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.
Share your comments