తెలంగాణ రాష్ట్రము లో అక్కడక్కడా పత్తి రైతుల ధర్నా లు జరుగుతూనే వున్నాయి కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు క్రింద 6080 ధర కల్పిస్తున్న రైతులకు అది గిట్టు బాటు ధరను కల్పించేలా లేదని పెట్టిన పెట్టుబడిలో కనీసం కూలి ఖర్చులు కూడా మిగిలే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు , కనీస మద్దతు ధర 6080 ఉన్న కొన్ని మార్కెట్లలో 5500 వరకు మాత్రమే దళారులు రైతులకు చెలిస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
ప్రభుత్వం పత్తి పంటకు రూ. 15,000 గిట్టుబాటు ధర కల్పించా కాలని డిమాండ్ చేస్తూ సోమవారం తుడుం దెబ్బ ఆధ్వర్యంలో లీడర్లు కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ ఏడాది రైతులు వర్షాలు, వరదల కారణంగా పంట దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారని పేర్కొ
న్నారు. ధర పెంచకపోతే ఆందోళనలు తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమం లో తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేశ్, ఉయిక సంజీవ్, జల్కే పాండురంగ్, కుడుమేత తిరుపతి,కుంర శ్యాంరావు, వెట్టి మనోజ్, ఉయిక సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
గిట్టుబాటు ధర కోసం రోడ్డు పైకి ప్రత్తి రైతుల...
గత నెలలో ఆదిలాబాద్ ,నిజామాబాద్ జిల్లలో రైతులు ధర్నాలు ,ర్యాలీలు నిర్వహిస్తూ పత్తి మద్దతు ధరను రూ . 15000 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు , గతం లో దీనిపై స్పందించిన రాష్ట్ర వవ్యవసాయ శాఖ మంత్రి MSP (కనీస మద్దతు ధర ) కేందర్ ప్రభుత్వం పరిధి లోని అంశమని చేతులు దులుపుకున్నారని , అకాల వర్షం కారణం గ దిగుబడి తగ్గడంతో ధర పెంచాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని రైతులు పేర్కొన్నారు .
Share your comments