ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పత్తి దిగుబడి మరియు ఉత్పాదకతను మెరుగుపరచాలని పిలుపునిచ్చారు
భారతదేశంలో పత్తి దిగుబడి మరియు ఉత్పాదకతను మెరుగుపరచడానికి రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి భాగస్వాములందరూ సంఘటిత ప్రయత్నాలు చేయాలని ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు ఈరోజు పిలుపునిచ్చారు. ప్రపంచంలోని ఇతర ప్రధాన పత్తి సాగుదారులతో పోలిస్తే భారతీయ తక్కువ దిగుబడిపై ఆందోళనను వ్యక్తం చేసారు,మెరుగైన పరిశోధనలు మరియు ఉత్తమ సాగు పద్ధతులను అనుసరించడంలో రైతులకు మార్గదర్శకత్వం వహించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.ఆధునిక వ్యవసాయ పద్ధతులకు మారాలని మరియు పత్తి పరిశ్రమలో ప్రపంచ అగ్రగామిగా మన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని" శ్రీ వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.
భారత ఆర్థిక వ్యవస్థకలో పత్తి యొక్క ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, ఉపరాష్ట్రపతి పత్తికి మన నాగరికత వారసత్వానికి గొప్ప బంధం ఉందని అన్నారు. 'స్వదేశీ ఉద్యమం'తో ప్రారంభమైన మన స్వాతంత్య్ర పోరాటంలో పత్తి కీలకపాత్ర పోషించిందని గుర్తు చేశారు. ప్రపంచంలోనే పత్తి సాగులో అత్యధిక విస్తీర్ణం (ప్రపంచ విస్తీర్ణంలో 39%) ఉన్నప్పటికీ, భారతదేశంలో హెక్టారుకు దిగుబడి 460 కిలోలు మాత్రమే ఉందని ఇది ప్రపంచ సగటు ఉత్పత్తి తో పోలిస్తే చాలా తక్కువని తెలిపారు. దీనిని పరిష్కరించడానికి, మొక్కల సాంద్రతను మెరుగుపరచడం, పత్తి పంటను యాంత్రీకరణ చేయడం మరియు వ్యవసాయ శాస్త్ర పరిశోధనలకు ఊతమివ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
పత్తి నూలులో భారతదేశం బలమైన ముద్రను కలిగి ఉన్నప్పటికీ, వస్త్రాలు మరియు దుస్తులలో దాని పోటీతత్వాన్ని మెరుగుపరచుకోవాలని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. చిన్న చిన్న సంస్థలకు చేయూతనివ్వాలని, టెక్స్‌టైల్ కార్మికులను అభివృద్ధి పరచాలని పిలుపునిచ్చారు. Technology Upgradation Funds Scheme మరియు Scheme for Capacity Building in Textile Sector(SAMARTH ) వంటి పథకాలు పత్తి ఉత్పత్తికి ఊతం ఇస్తున్నాయని వాఖ్యానించారు.
ఈ సందర్భంగా సిఐటిఐ-సిడిఆర్‌ఎ ప్రాజెక్టు ఏరియాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పత్తి శాస్త్రవేత్తలు, రైతులకు వెంకయ్య నాయుడు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో Millennial Shades of Cotton అనే పుస్తకాన్ని విడుదల చేశారు.
మరిన్ని చదవండి.
Share your comments