మరికొద్ది రోజుల్లో మార్కెట్ లోకి కొత్త పత్తి రానున్నది. కానీ గత సీజన్లో పత్తిని సాగు చేసిన రైతులు ఇంకా చాలా వరకు వాళ్ళ ఇళ్లలోనే నిల్వ చేశారు. ఆ రైతులు అనుకున్న ధర రాకపోవడమే వారు ఇలా ఇళ్లలో నిల్వ చేసుకున్నారు. ప్రస్తుతం పత్తి ధర తగ్గుముఖం పట్టడం రైతులను వేదనకు గురిచేస్తోంది. పత్తిని ఎక్కువ కాలం నిల్వ ఉంచడం వల్ల బరువు తగ్గుతుందని భయం రైతుల్లో నెలకొంది.
రైతులు కనుక ఈ సమయంలో పత్తిని అమ్మితే, వారికి వచ్చే డబ్బులు అనేవి అప్పుల వడ్డీలకే సరిపోతాయని దిగులు చెందుతున్నారు. 2022-23 సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఎకరాకు 6 క్వింటాళ్ల చొప్పున సుమారు 3 కోట్ల క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని అంచనా వేశారు.
ఈ పంటలో 25 శాతానికి పైగా ప్రస్తుతం రైతుల ఇళ్లలో నిల్వ ఉంది, ప్రధానంగా వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం మరియు కరీంనగర్ జిల్లాలలో ఈ పరిస్థితులు ఉన్నాయి . మార్కెట్‌లోకి కొత్త పత్తి రావడంతో పాత పత్తి ధర తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి..
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు మరో శుభవార్త తెలిపిన ప్రభుత్వం..
2021 సంవత్సరానికి భిన్నంగా, పత్తి ధర క్రమంగా తగ్గుతూ వస్తుంది. 2021 సంవత్సరంలో క్వింటాల్ పత్తికి రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ధర లభించింది. 2022లోకి మారే నాటికి క్వింటాల్ ధర రూ.9 వేలకు పైన విక్రయాలు జరిగాయి. అయితే, గత డిసెంబరు నుంచి ధర పతనమవుతూ వచ్చింది. క్వింటాకు రూ.8 వేల నుంచి 7,200కు పడిపోయింది.
రైతులు పెట్టిన పెట్టుబడులు రాక రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేసారు అయినా ప్రయోజనం లేకుండా పోయింది. కాగా రైతులు గతంలో, పత్తి ధరలు నిలకడగా ఉండక పోవడంతో ఎట్టకేలకు ధరలు పెరుగుతాయనే ఆశతో పలువురు రైతులు పండించిన పంటను నిల్వ చేసుకున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments