ప్రపంచంలో ఎన్నో వింతలు మనల్ని అబ్బురపరిచే సంఘటనలు జరుగుతుంటాయి అందులో కొన్ని హాస్యాస్పదంగా ఉంటే కొన్ని మనల్ని ఆలోచింపచేసే విధంగా ఉంటాయి అలాంటిదే ఈ ఘటన సాధారణంగా మనం ఏదయినా బ్రేక్ ఫాస్ట్ తీసుకున్నపుడు దానితో పాటు తినడానికి చట్నీని లేదా సాంబారును ఇస్తుంటారు అయితే కొందరు ఇవ్వకపోతే మనం ఏంచేస్తాం గొడవపడి వెళ్ళిపోతాం కానీ ఇక్కడ వినియోగదారుడు చేసిన పనిపై ఆ రెస్టారెంట్ పై ఏకంగా 35 వేలు జరిమానా పడింది.
బిహార్‌లో ఓ వినియోగదారుడికి దోశతో పాటు సాంబార్ ఇవ్వని రెస్టారెంటుకు వెళ్ళాడు నమక్ రెస్టారెంట్‌కు వెళ్లి మసాలా దోశ ఆర్డర్ ఇచ్చారు.
దానిని ఇంటికి పార్సిల్ పట్టుకెళ్లి తెరిచి చూడగా అందులో సాంబార్ లేదు. వెంటనే ఆ రెస్టారెంట్‌కు వెళ్లి తన పార్సిల్‌లో సాంబార్ లేదని తెలపగా, హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు అమర్యాదగా ప్రవర్తించారు. దీనికి ప్రతిగా మనీశ్ రెస్టారెంటుకు.. కోర్టు నుంచి లీగల్ నోటీసు పంపగా వారు సమాధానం ఇవ్వలేదు.
దాంతో ఆయన జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. 11 నెలల పాటు కేసును విచారించిన కోర్టు.. నమక్ రెస్టారెంట్‌కు రూ. 3,500 జరిమానా విధించింది.
తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు.. జూన్ 1వ తేదీ నుండి కొత్త రేట్లు అమలు
కాబ్బటి మీకు ఇలాంటి సంఘటనలు ఎదురైతే సంకోచించకుండా ఏదయినా వస్తువు తీసుకున్న లేదా ధరలు అధికంగా విధిస్తున్న సంబంధిత సమాచారాన్ని వినియోగదారుల ఫోరంలో కంప్లైంట్ చేయవచ్చు దీనితో మీకు నష్ట పరిహారం తో పాటు మీరు అడిగిన అంశం పై న్యాయం జరిగే అవకాశం వుంది.
Share your comments