News

గోమూత్రం: కూల్ డ్రింక్స్ లాగే ఇప్పుడు వివిధ ఫ్లేవర్స్ లో గోమూత్రం! ధర ఎంతో తెలుసా?

Sriya Patnala
Sriya Patnala
cow urine aka go mutram comes in various flavors under the name Sanjeevani ras
cow urine aka go mutram comes in various flavors under the name Sanjeevani ras

హిందూ సంప్రదాయంలో గోమూత్రానికి ఉన్న ప్రాముఖ్యత గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు .గృహ ప్రవేశాలలో, వివిధ ఆచారాల్లో పవిత్రమైన గోమూత్రం వినియోగిస్టారు .మనం ఆయుర్వేదాన్ని విశ్వసిస్తే, ఆవు మూత్రం తీసుకోవడం వల్ల మనిషి శరీరంలోని అనేక రకాల వ్యాధులు నశిస్తాయని నమ్ముతారు. నేటి కాలంలో, అనేక పెద్ద కంపెనీలు మరియు సంస్థలు దీనిని ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నాయి.

కానీ గోమూత్రం వాసన, దాని విచిత్రమైన రుచి వల్ల దానిని తాగలేము.ఈ సమస్య పరిష్కరించాడనికే , తాజాగా శాస్త్రవేత్తలు వివిధ రుచులు( ఫ్లేవర్స్ ) కలిగిఉన్న గోమూత్రాన్ని తాయారు చేశారు. సంజీవని పేరుతో ఈ గోమూత్రాన్ని విక్రయిస్తామన్నారు. అంటే ఇప్పుడు మీరు గోమూత్రంలో వివిధ రకాల అద్భుతమైన రుచులని ఆస్వాదిస్తూ తాగొచ్చు . గోమూత్రం తాగమని గొడవ చేసే పిల్లలతో కూడా తాగించచ్చు.

ఈ గోమూత్రాన్ని IIT ముంబై నుండి PhD చేసిన డాక్టర్ రాకేష్ చంద్ర అగర్వాల్ తయారు చేశారు. ఈ రుచిగల గోమూత్రానికి సంజీవని రస్ అని పేరు కూడా పెట్టాడు.

ఇది కూడా చదవండి

పురుగు మందుల బదులు మద్యం పిచికారీ; రెండు రెట్లు లాభం అంటున్న రైతు

రుచిలో పులుపు, తీపి, లవణం వంటివి ఇష్టమైతే ఇప్పుడు గోమూత్రంలో ఈ రుచులన్నీ వస్తాయి. ప్రస్తుతం గోమూత్రాన్ని 6 రుచులలో తయారు చేస్తున్నారు. అవే :

మామిడి

నారింజ

అనాస పండు

స్ట్రాబెర్రీ

పాన్ మరియు

మిక్స్ ఫ్లేవర్ మొదలైన రుచులు అందుబాటులో ఉంటాయి.

సంజీవని గోమూత్రం మార్కెట్ లో లీటర్ - 200/- రూపాయలకు లభించనుంది.

డాక్టర్ రాకేష్ చంద్ర అగ్రవన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ ల్యాబొరేటరీలలో సంజీవని రస్‌ని తయారు చేసేందుకు యువత మరియు శాస్త్రవేత్తలకు శిక్షణ ఇస్తున్నారు. తద్వారా దేశ ప్రజలకు ఇది సులువుగా చేరనుంది.

ఇది కూడా చదవండి

పురుగు మందుల బదులు మద్యం పిచికారీ; రెండు రెట్లు లాభం అంటున్న రైతు

Related Topics

#cow urine #gomutram

Share your comments

Subscribe Magazine