తెలంగాణ మాజీ గవర్నర్ తమిళశై సౌందరాజన్, తన గవర్నర్ పదవికి రాజీనామా చేసారని మనందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు తెలంగాణ కొత్త గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ ను నియమించారు. ఈ రోజు రాజభవన్లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ అలోక్ ఆరాధే, రాధాకృష్ణన్ తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం. రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ప్రస్తుతం రాధాకృష్ణన్ ఝార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమిళశై రాజీనామా అనంతరం, రాష్ట్రపతి ద్రవపతి ముర్ము, కొత్త గవర్నర్ గా రాధాకృష్ణన్ ను నియమించారు. రాధాకృష్ణన్, తమిళనాడులోని కోయంబత్తూరు నుండి రెండు సార్లు బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అద్యక్షుడిగాను బాధ్యతలు చేపట్టారు. కాయర్ బోర్డు చైర్మనుగా 2016 నుండి 2019 వరకు సేవలందించారు.
Read More
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాలు ఇవే..
2023 నుండి ఝార్ఖండ్ గవర్నర్ గా భాద్యతలు నిర్వహిస్తున్న రాధాకృష్ణన్ కు ఇప్పుడు తెలంగాణ మరియు పుదుచ్చేరి గవర్నర్ గా అదనపు భాద్యతలు అందించారు. రెండు చోట్ల పూర్తిస్థాయి గోవేర్నర్లను నియమించేంతవరకూ సీపీ రాధాకృష్ణన్ భాద్యతలు నిర్వహిస్తారని రాష్ట్రపతి కార్యాలయం విదుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సీపీ రాధాకృష్ణన్ తో కలిపి తెలంగాణకు ఇంతకుముందు పనిచేసిన ఇద్దరు గోవేర్నర్లు కూడా తమిళనాడుకు చెందిన వారే కావడం ప్రత్యేకం.
Share your comments