
CPIM నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్ర ఆంధ్రప్రదేశ్ కొవ్వలి గ్రామం చేరుకుంది. కొవ్వలి గ్రామంలో పర్యటించిన CPIM ప్రతినిధులు, గ్రామంలో దళిత, పేద వ్యవసాయదారులు సాగు చేసుకుంటున్న భూమి భూహక్కు పత్రాలు ఇవ్వాలని, అలానే సాగుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై ప్రజా చైతన్య యాత్రను కొవ్వలిలో ఈ శుక్రవారం ప్రారంభించారు. ఈ యాత్రావేదిక లో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ వరి సాగు వల్ల కాలుష్యం ఏర్పడుతుందనే విపరీత వాదనతో కోర్టుకెళ్లడంపై రవి తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా కొవ్వలిలో అప్పటి ప్రభుత్వాలు 1963 నుండి బంజరు భూమిగా ఉన్న 304 ఎకరాల ప్రభుత్వ భూమిని 101ఎకరాలు సాగుభూములకు, 25 ఎకరాలు మత్స్యశాఖకు పంచి, తర్వాత మిగిలిన భూమిని, భూమి లేని దళిత, పేద రైతులు సాగుకు వాడుకొనే ఆసరా కల్పించారని చెప్పుకోచ్చారు. ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వం దగ్గర ఉండాలి, లేకపోతే పేదల దగ్గర ఉండాలని చట్టం లో రాసి ఉన్నాగాని, దాని అమలులో రెవెన్యూ అధికారులు నెమ్మది ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి పనితీరు వల్ల దళితులు, పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారని ప్రభుత్వ ఉద్యోగుల్ని దుయ్యపట్టారు.
కొవ్వలి లో త్రాగు నీటి చెరువులో పూడిక తీసి అందరికి నీళ్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంతోమంది దళిత, పేద రైతులు కొవ్వలిలో సుమారు యాభై సంవత్సరాలుగా పన్నులు చెల్లించి వ్యవసాయ భూములను సాగు చేస్తుంటే, వెలమాటి సౌందర్య వారిపై కేసు వేసి ఇటువంటి కక్షసాధింపు చర్యలకు పూనుకోవటం చాల అన్యాయమైన పని గా పేర్కొన్నారు. ఆవిడ అన్యాయంగా పేదలకు చెందిన అసైన్డ్ భూములను సొంతంగా సాగు చేసుకుంటున్నారని, కానీ పేద రైతులుసాగు చేసుకుంటున్న భూములపై కోర్టులో కేసు వేయడం తప్పుడు పని అని ఆరోపించారు. ఈ సందర్బంగా దళ నేత రామకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అన్యాక్రాంతమయ్యాయని ఎన్నో ఎకరాల భూములపై, రెవెన్యూ, పంచాయతీ అధికారులు పూర్తిస్థాయి సర్వేలు చేసి నిజాలు బయటపెట్టాలని కోరారు. అతికొద్ది రోజుల్లో కొవ్వలి భూసమస్యపై సిపిఎం పెద్దఎత్తున పోరాటానికి సిద్ధం అవుతుందని పిలుపునిచ్చారు.
Share your comments