తెలంగాలోని రైతుల రుణబాధలను తగ్గించాలన్న లక్ష్యంతో, రేవంతా రెడ్డి ప్రభుత్వం, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రుణమాఫీని ప్రారంభించింది. రుణమాఫీలో భాగంగా రెండు లక్షల వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఇప్పటికే రుణమాఫీ రెండు విడతలు పూర్తికాగా, మూడోవిడత నిధులను ఆగష్టు 15 గురువారం రోజున విడుదల చేసారు. దీనితో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంది.
రేవంతా రెడ్డి సర్కారు మొత్తం మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. మొదటి విడతలో లక్ష రూపాయిల రుణాలను మాఫీ చేసింది, రెండొవ విడతలో 1.50 లక్షల లోపు ఉన్న రుణాలను మాఫీ చేసారు. తాజాగా మూడో విడతలో రెండు లక్షల లోపు రుణాలును మాఫీ చేసారు. అయితే అర్హత ఉన్న కొంతంది రైతులకు మూడో విడతలో కూడా రుణమాఫీ కాలేదు, దీనితో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మూడో విడతలో కూడా రుణమాఫీ కాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి, వీటిలో భూమి పాస్-బుక్ మీద ఒక పేరు మరియు ఆధార కార్డు మీద మరొక్క పేరు ఉండటం ప్రధాన కారణం. మరికొంత మందికి వివిధ కారణాల వలన రుణమాఫీ కాలేదు. దీనితో అర్హత ఉన్నాసరే తమకు రుణమాఫీ జరగలేదని రైతులు ఆందోళనలో ఉన్నారు. అన్నదాతల ఆందోళనను అర్ధం చేసుకున్న రేవంత్ ప్రభుత్వం, వీరికి స్వాతంత్ర దినోత్సవం రోజున తీపి కబురు అందించారు.
ఆగష్టు 15, 78 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, గోల్కొండలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు, ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఇప్పటివరకు 2 విడతల రుణమాఫీ చేశామని, ఆగష్టు 15 న మూడో విడత రుణమాఫీ కూడా చేస్తున్నట్లు అయన పేర్కొన్నారు. మూడు విడతల్లో రుణమాఫీ అందని రైతులు ఆధైర్యపడొద్దని చెప్పారు. రుణమాఫీ కానీ అన్నదాతల కోసం త్వరలోనే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని అయన ప్రస్తావించారు. అర్హులైన రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని అయన స్పష్టం చేసారు. అంతేకాకుండా త్వరలోనే రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని అయన ప్రస్తావించారు.
Share your comments