ఇటీవలి కురిసిన అకాల వర్షాల వలన అనంతపురం రైతులకు భారీగా పంట నష్టం వచ్చింది. ఎక్కువ పెట్టుబడులు పెట్టి పంట చేతికి వస్తుంది అన్న సమయంలో ఈ వర్షాల వళ్ళ పంట నష్టపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అకాల వర్షాలు రైతులకు తీవ్రమైన నష్టాల్నే మిగిల్చాయి.
జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 16 మండలాల్లో పంట నష్టం జరిగింది. ఈ పంట నష్టాల్లో ఎక్కువగా అరటి పంట దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. అత్యధికంగా అనంతపురంలో నాయనపల్లి గ్రామం పరిధిలో పంట నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఏపుగా ఎదిగిన అరటి చెట్లు ఈ అకాల వర్షాల కారణంగా వాలిపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. పంట నష్టాల్లో అరటి తరువాత మామిడి, బత్తాయి పంటలకు అధిక నష్టం జరిగింది.
మార్కెట్లో ఆరతి ధర ఎన్నడూ లేనివిధంగా ఒక టన్ను అరటి ధర రూ.20 వేలకుపైగా ఉంది. ఇటువంటి సమయంలో పంటలకు ఈ గతి పట్టడంతో రైతులు దుఃఖానికి లోనవుతున్నారు. సుమారుగా మూడు రోజుల నుండి కురిసిన ఈ గాలులతో కూడిన వర్షాలు మరియు వడగండ్ల వలన జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లో కలిపి 11052 ఎకరాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలియజేసారు. అరటికి మంచి ధర ఉన్న సమయంలో పంట మొత్తం నేలపాలు కావడంతో రైతులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..
వరి పంటలకు ఎకరానికి 45 వేలు రుణం ..
నష్టం వాటిల్లిన 11052 ఎకరాల్లో సుమారుగా 530 ఎకరాల్లో అరటి పంట దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నష్టం విలువ అనేది రూ.31.80 కోట్లు ఉంటుంది. ఇది ఇలా ఉండగా మడ్డిపల్లిలో రూ.26 కోట్లు, మడుగుపల్లిలో రూ.20 కోట్లు, నడిమిదొడ్డి గ్రామంలో రూ.15.60 కోట్ల విలువగల పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు.
అరటి తరువాత 1088 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతింది. ఈ మామిడి పంట నష్టం అనేది సుమారుగా రూ.18.49 కోట్లు ఉంటుంది. తరువాత బత్తాయి పంట 1480 ఎకరాల్లో దెబ్బతినగా దాని విలువ వచ్చేసి రూ..21.29 కోట్లు నష్టం వచ్చింది. జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 11052 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా, ఆ నష్టం విలవ అనేది సుమారుగా రూ.211.91 కోట్లుగా ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు.
ఇది కూడా చదవండి..
Share your comments