కామన్ యూనివర్శిటీ ప్రవేశ పరీక్షను(Common University Entrance Test)నిర్వహించే బాధ్యత కలిగిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వచ్చే సెషన్ నుంచి ఏడాదికి రెండుసార్లు సీయూఈటీని (CUCET ) నిర్వహించే అవకాశం ఉంది.
ఈ సంవత్సరం ఒకసారి నిర్వహించబడుతుంది, అయితే ఎన్‌టిఎ తదుపరి సెషన్ నుండి సంవత్సరానికి కనీసం రెండుసార్లు పరీక్షను నిర్వహించడాన్ని పరిశీలిస్తుంది" అని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) చైర్మన్ జగదీష్ కుమార్ పిటిఐ వార్తా సంస్థ కు వెల్లడించారు .
అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం (Common University Entrance Test) నుండి వచ్చిన స్కోర్‌లను ప్రామాణికం గ తీసుకోవడానికి ప్రముఖ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఈ టెస్ట్ పరిధిలోకి రానున్నాయి , CUET కేవలం సెంట్రల్ యూనివర్శిటీలలో అడ్మిషన్లకే పరిమితం కాదని కుమార్ చెప్పారు .
అండర్ గ్రాడ్యుయేట్ (డిగ్రీ ) అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష 'కోచింగ్ కల్చర్'కు దారితీస్తుందా అని అడిగిన ప్రశ్నకు, కుమార్ మాట్లాడుతూ, "పరీక్షకు ఎటువంటి కోచింగ్ అవసరం లేదు కాబట్టి ఇది కోచింగ్ సంస్కృతికి దారితీయదు . ప్రశ్నలు పూర్తిగా 12వ తరగతి సిలబస్, 11వ తరగతి సిలబస్ నుండి మాత్రమే ఉంటాయని అయన వెల్లడించారు
UGC నిధులతో పనిచేసే అన్ని సెంట్రల్ యూనివర్సిటీలలో(Common University Entrance Test) 2022-2023 అకడమిక్ సెషన్ నుండి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ కోసం కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ జూలైలో నిర్వహించబడుతుందని కుమార్ గత వారం ప్రకటించారు.
45 కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ప్రవేశానికి CUET స్కోర్‌లు తీసుకుంటాము తప్ప XII తరగతి స్కోర్‌లు కాదని, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు వాటి కనీస అర్హత ప్రమాణాలను నిర్ణయించగలవని కూడా ఆయన తెలియజేశారు.
Share your comments