News

నేటితో ముగియనున్న ఆధార్ అప్డేట్ గడువు .. అప్డేట్ చేసుకోండి ఇలా !

Srikanth B
Srikanth B
నేటితో ముగియనున్న ఆధార్ అప్డేట్ గడువు ..  అప్డేట్ చేసుకోండి ఇలా   !
నేటితో ముగియనున్న ఆధార్ అప్డేట్ గడువు .. అప్డేట్ చేసుకోండి ఇలా !

భారతదేశంలో అత్యున్నత గుర్తింపు కార్డుగా అన్ని ప్రభుత్వ పథకాలకు అన్ని రకాల లావాదేవీలకు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడే ఒకే ఒక పత్రం ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు జారీ చేసి చాలా సంవత్సరాలు గడిచిన నేపథ్యం లో ప్రభుత్వం ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని సూచించింది . ఆధార్ కార్డు అప్డేట్ కు ప్రభుత్వం విధించిన గడువు జూన్ 14 తేదీతో ముగియనుంది .

అటువంటి పరిస్థితిలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 14 జూన్ 2023 వరకు ఆధార్ పత్రాల ఆన్‌లైన్ అప్‌డేషన్‌ను ఉచితంగా చేసింది. సాధారణంగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడానికి దాదాపు రూ.50 లేదా రూ.100 ఫీజు ఉంటుంది. అయితే యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు .

ఆధార్ అప్డేట్ కు ఇంకా 14 రోజుల గడువు మాత్రమే మిగిలివుంది కావున ఇప్పటికి ఎవరైనా ఆధార్ కార్డు అప్డేట్ చేయని పక్షంలో క్రింద సూచించిన సులభమైన మార్గం ద్వారా ఆన్లైన్ లో అప్డేట్ చేసుకోవచ్చు .

ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు హోల్డర్లకు శుభవార్త.. వచ్చే నెల నుండే పంపిణీ ప్రారంభం

ఆన్‌లైన్‌లో ఆధార్ అప్డేట్ చేయడనికి క్రింది దశలను అనుసరించండి .

ఆధార్ నంబర్‌ని ఉపయోగించి వెబ్‌సైట్‌ myAadhaar పోర్టల్‌లో ద్వారా లాగిన్ అవ్వండి.
‘ప్రొసీడ్ టు అప్‌డేట్ అడ్రస్’ ఎంపికను ఎంచుకోండి.

రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

దీని తర్వాత మీరు ‘డాక్యుమెంట్ అప్‌డేట్’పై క్లిక్ చేయాలి.

దీని తర్వాత, ఏదైనా అప్‌డేట్ చేయవలసి ఉంటుంది.

చివరగా ‘సమర్పించు’ బటన్‌ను ఎంచుకోండి. పత్రాలను అప్‌డేట్ చేయడానికి, వాటి కాపీలను అప్‌లోడ్ చేయండి.

ఆధార్ అప్‌డేట్ అభ్యర్థన ఆమోదించబడుతుంది అలాగే 14 అంకెల అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) రూపొందించబడుతుంది.

అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)ని ఉపయోగించి ఆధార్ చిరునామా అప్‌డేట్ స్థితిని తనిఖీ చేయవచ్చు. అప్‌డేట్ చేసినప్పుడు, మీరు అప్‌డేట్ చేసిన వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ప్రింటెడ్ ఆధార్ కార్డ్‌ని పొందవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు హోల్డర్లకు శుభవార్త.. వచ్చే నెల నుండే పంపిణీ ప్రారంభం

Share your comments

Subscribe Magazine

More on News

More