Death toll in Gujarat bridge collapse rises to 141
గుజరాత్ వంతెన కూలిన ఘటనలో 141 కి చేరిన మృతుల సంఖ్య
గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో వంతెన కూలిన దుర్ఘటనలో ఇప్పటివరకు 141 మంది మరణించారు మరియు మృతుల సంఖ్య
ఇంకా పెరిగే అవకాశము వుంది .
గుజరాత్ లో మోర్బి బ్రిడ్జి గ పిలువబడే ఈ వంతెన చాల పురాతనమైనది దీనికి గత కొద్దీ రోజులక్రితమే మరమత్తులు చేసి తెరిగి 3 రోజుల క్రితమే ప్రారంభించారు. ప్రారంభించిన కొన్ని రోజులకే ఏ సంఘఠన జరగడం అక్కడి ప్రజలను కలచివేసింది . వంతెన కూలిపోవడంతో అక్కడి నుంచి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఎన్‌డిఆర్‌ఎఫ్, వైమానిక దళం మరియు అగ్నిమాపక దళం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోట్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 177 మందికి పైగా రక్షించబడ్డారు.
140 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ వేలాడే వంతెన ఎన్నో ఆశ్చర్యాలకు గురి చేసింది. బ్రిటీష్ వారు కేబుల్స్ సహాయంతో నిర్మించిన అతి పొడవైన వేలాడే వంతెన ఇది.
నిన్న సెలవు దినం కావడంతో ఈ ప్రాంతంలో జనం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 100 మంది సామర్థ్యం ఉన్న బ్రిడ్జిపై ఐదు వందల మందికి పైగా నడవడం వల్లే కేబుల్ తెగిపోయి వంతెన పడిపోయిందని చెబుతున్నారు.శిథిలావస్థలో ఉన్న వంతెనను రూ.2 కోట్లతో పునరుద్ధరించారు. ఐదు రోజుల క్రితం పునరుద్ధరించిన వంతెనను ప్రారంభించారు.
మూడు రోజుల క్రితం ప్రజల ప్రవేశానికి తెరిచారు. ఇప్పుడు అకస్మాత్తుగా పడిపోవడంతో అక్రమ పనులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఘటన జరిగిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించే అవకాశం ఉంది. ఈమేరకు మృతుల కుటుంబాన్ని ఓదార్చడంతో పాటు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు యాభై వేల పరిహారం అందించనున్నారు . ఈ కేసుపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
Share your comments