భారతీయులకు ఎంతో ప్రీతికరమైన పానీయాల్లో మొదట ఉండేది ఛాయ్. టీ లేదా ఛాయ్ ని భారతీయుల ఫేవరెట్ డ్రింక్ అని కూడా పిలుస్తారు. రోజు ఆరభించినప్పటినుండి సాయంత్రం పడుకునే వరకు ఏదో విధంగా టీ తాగుతాం. బాగా అలసిపోయినప్పుడు, పని ఒత్తిడి ఎక్కువుగా ఉన్నపుడు టీ తాగడం వలన రిలీఫ్ గా అనిపిస్తుంది.
టీపొడి ఉత్పత్తి చెయ్యడానికి ఉపయోగించే తేయాకు, వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఎక్కువగా పండుతుంది. ఇక్కడ ఉత్పత్తియైన టీ భారత దేశంలోని ప్రజలతో పాటు బయట దేశాల వాళ్లు ఆస్వాదిస్తారు. అయితే ఈ ఏడాది టీ దిగుబడిలో 30% తగ్గుదల కనబడింది అని వినగానే ఛాయ్ ప్రేమికులందరికి గుండెల్లో రాయి పడినట్లయింది. దేశంలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు టీ దిగుబడి మీద కూడా ప్రభావం చూపింది.
ఎండల ధాటికి ప్రజలంతా అవస్థలు పడుతుంటే మరోపక్క వ్యవసాయం కూడా ఎండ ప్రభావానికి గురవుతుంది. ఈ సారి అధిక ఉష్ణోగ్రతల ప్రభావం భారతం దేశంలోని అన్ని ప్రాంతాల మీద పడింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 40℃ మార్క్ చేరుకున్నాయి, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించి.
అధిక ఉష్ణోగ్రతల ప్రభావం తేయాకు పంట మీద కూడా పడింది. సాధారణంగా తేయాకు చెట్లు బాగా పెరిగి మంచి దిగుబడి ఇవ్వడానికి 28-30 ℃ మధ్య ఉష్ణోగ్రతలు అవసరం. ఇటువంటి పరిస్థితులున్న ఉత్తర బెంగాల్ ప్రాంతంలో తేయాకు పెంచడానికి అనుకూలం. అయితే ఈ సంవత్సరం వేసవి కాలంలో అధిక నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు తేయాకు దెబ్బతిని పంట దిగుబడిలో తగ్గిపోయిందని అక్కడి రైతులు వాపోతున్నారు.
తేయాకు పంట వర్షాధారిత పంట, పోయిన సంవత్సరం వర్ష శాతం అంతంతమాత్రమే కావడంతో టీ ఆకుల దిగుబడి బాగా తగ్గిపోయింది. ఉత్తర బెంగాల్ ప్రాంతంలో మట్టిలోని నీటి శాతం భాగా తగ్గిపోయింది, దీనితో ఈ ప్రాంతం నుండి ఉత్పత్తయ్యే తేయాకుల దిగుబడి 30-35 శాతం తక్కువుగా నమోదయ్యింది.
Share your comments