ఢిల్లీ బిడ్జెట్ 2024: రూ . 76,000 కోట్లతో, 2024-25 ఆర్ధిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ను, ఢిల్లీ ఆర్ధిక శాఖ మంత్రి. అతిషి ప్రవేశపెట్టారు. ఢిల్లీ లోకసభ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో, ఆ రాష్ట్ర మహిళలకు ప్రత్యేక బహుమతిగా ఇకనుండి ప్రతినెలా మహిళల ఖాతాల్లో 1000 రూపాయిలు జమ చెయ్యనున్నారు. పూర్తి వివరాలు మీ కోసం.
బడ్జెట్ 2024: కొంతకాలంగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో, ఆర్ధిక శాఖ మంత్రి అతిషి 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను సమర్పించారు. విద్య, ఆరోగ్య, మరియు పారిశ్రామిక రంగాల అభివృధే ధ్యేయంగా ఈ బడ్జెట్ రూపొందించారు. వీటితో పాటుగా, మహిళలకు బహుమానంగా ఇస్తామన్నా, "ముఖ్య మంత్రి మహిళా సమ్మాన్ యోజన" గురించి కూడా ఈ బడ్జెట్ లో ప్రస్తావించారు.
ప్రసంగం మొదట్లో ఢిల్లీ ఆర్ధిక మంత్రి, ఈ పది సంవత్సరాలో తమ ప్రభుత్వం సాధించిన ఘనత గురించి ప్రసంగించారు. ప్రజలు జీవితాలను కొత్త ఆశలవైపు, అభివృద్ధివైపు నడిపిస్తున్నాం అని ఆమె తెలిపారు. ఢిల్లీలో ప్రభుత్వ ఆసుపత్రులలో, వసతులు మెరుగు పరిచేందుకు రూ. 8,865 కోట్ల బడ్జెట్ నుండి కేటాయించనున్నారు. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా, రూ . 16,369 కోట్ల రాష్ట్ర విద్య సాధికారత పెంపొందిచేందుకు ఉపయోగించనున్నారు. పర్యావరణాన్ని సంరక్షణలో భాగంగా ప్రస్తుతం వినియోగిస్తున్న, ఎలక్ట్రిక్ బస్సులు, నిర్వహణకు 500 కోట్ల రూపాయిలు కేటాయించారు. మెట్రో నిర్వహణకు బడ్జెట్ రూ. 501 కోట్లుగా ప్రతిపాదించారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం, మరియు వాళ్ళ పిల్లకు మెరుగైన విద్య అందించాం అన్నారు. కోటి కన్నా జనాభా ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో ఢిల్లీని మొదటి స్థానంలో ఉంచాం అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రజలు తలసరి ఆదాయం 4.62 లక్షలు ఉంది.
ముఖ్యమంత్రి మహిళా మహిళా సమ్మాన్ యోజన:
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన, ముఖ్య మంత్రి మహిళా సమ్మాన్ యోజన ద్వారా, ఇప్పటినుండి 18 సంవత్సరాలు దాటిన ఢిల్లీ మహిళలు అందరికి, వారి బ్యాంకు ఖాతాల్లో ప్రతినెలా రూ. 1000 జమ చెయ్యనున్నారు. ఈ స్కీం కోసం రాష్ట్ర బడ్జెట్ లో ప్రత్యేకంగా రూ. 2000 కోట్ల రూపాయిలు కేటయించారు. మహిళా సాధికారత సాధించాలన్న ముఖ్య ఉదేశ్యంతో ప్రభుత్వం ఈ స్కీం ప్రవేశపెట్టింది అని ఆర్ధిక మంత్రి అతిషి ప్రస్తావించారు.
Share your comments