భారత్ లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో 15 ఏళ్లలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. జనవరి 1న ఢిల్లీలో కేవలం 1.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం విశేషం.
చలిపులి విజృంభిస్తోంది. ఉత్తర భారతాన్ని వణికిస్తోంది. రాజధాని నగరం ఢిల్లీని తీవ్రమైన చలిగాలులు గజగజలాడిస్తున్నాయి. 15 ఏళ్ల కనిష్టానికి ఉష్ణోగ్రత చేరుకోవడంతో ఢిల్లీ తల్లడిల్లుతోంది.
గతంలో 2006లో జనవరిలో అత్యల్పంగా 0.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభమై తీవ్రమైన చలితో ప్రారంభమైంది. ఢిల్లీ నగరంపై తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయిప్పుడు. గత పదిహేనేళ్లలో ఇదే కనిష్టం.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని విశాఖ ఏజెన్సీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదౌతుండగా.. తెలంగాణలోని అదిలాబాద్, అసీఫాబాద్ లలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.
అంతకుముందు 2006లో 0.2 డిగ్రీలు, 1935లో 0.6 డిగ్రీల ఆల్ టైమ్ ఉష్ణోగ్రత నమోదైంది. 2019 జనవరిలో 2.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఢిల్లీలో మంచు తుఫాను... మంచులో చిక్కుకున్న వాహనాలు... రోడ్లపై ఎక్కడ చూసినా మంచు...తీవ్రమైన చలి కారణంగా దట్టమైన పొగమంచు నగరాన్ని కమ్మేసింది. మీటర్ దూరంలో ఉన్న వస్తువులు కూడా కన్పించక ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనవరి 2 నుంచి 6 వ తేదీ వరకూ మధ్యధరా ప్రాంతం నుంచి వీచే గాలుల వల్ల...ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతల్లో మార్పు ఉంటుందని ఐ.ఎం.డి సూచించింది.
Share your comments