ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్ష 2022 (DUET) కోసం దరఖాస్తు ప్రక్రియను ఢిల్లీ విశ్వవిద్యాలయం గురువారం (ఏప్రిల్ 7, 2022) నుండి ప్రారంభించింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల కోసం అడ్మిషన్ ఫారమ్‌లను DU తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ - pgadmission.uod.ac.inలో ఆన్‌లైన్ మోడ్‌లో DU PG 2022 అడ్మిషన్ ఫారమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
PG కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుదారులు ఢిల్లీ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష (DUET)కి హాజరు కావాలి. 2022-23 సెషన్ కోసం DU PG అడ్మిషన్ కోసం చివరి తేదీ మే 15.
దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించిన తర్వాత అందులో ఎలాంటి మార్పులు చేయడానికి అనుమతించబడరని అభ్యర్థులు గమనించాలి.
DU PG అడ్మిషన్ 2022: ఎలా నమోదు చేసుకోవాలి
దశ 1. DU అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి - pgadmission.uod.ac.in
దశ 2. హోమ్‌పేజీలో "న్యూ యూసర్ " పై లింక్‌పై క్లిక్ చేయండి
దశ 3. అవసరమైన వివరాలను పూరించండి
దశ 4. సమర్పించుపై క్లిక్ చేయండి
దశ 5. దరఖాస్తు రుసుమును చెల్లించి, భవిష్యత్తు అవసరాల కోసం పేజీని డౌన్‌లోడ్ చేయండి.
DUET PG అప్లికేషన్: అవసరమైన ధ్రువ పత్రాలు:
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో
- స్కాన్ చేసిన సంతకం
- చెల్లుబాటు అయ్యే ID ప్రూఫ్ (సెల్ఫ్ అటెస్టెడ్). ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ / ఓటర్ ఐడెంటిటీ కార్డ్ / పాన్ కార్డ్ / పాస్‌పోర్ట్ / డ్రైవింగ్ లైసెన్స్ మెదలైనవి.
- పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం 10వ తరగతి సర్టిఫికేట్ (సెల్ఫ్ అటెస్టెడ్).
- కుల ధృవీకరణ పత్రం (స్వీయ ధృవీకరణ)
-
BOB RECRUITMENT 2022:బ్యాంకు అఫ్ బరోడాలో అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్ల పోస్టులు, నెల జీతం 1,50,000
Share your comments