సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ (CGWB) ప్రాంతీయ స్థాయిలో, పట్టణ ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా భూగర్భ జల స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. భూగర్భ జలమట్టంలో దీర్ఘకాలిక హెచ్చుతగ్గులను అంచనా వేయడానికి, నవంబర్ 2021లో CGWB ద్వారా చేపట్టిన పరిశోధన ఆధారంగా నీటి స్థాయిని విశ్లేషిస్తే నీటి బావులలో సుమారు 30% భూగర్భజల మట్టంలో క్షీణించి పోగా 70% బావులు నీటి మట్టం పెరుగుదలను సూచిస్తున్నాయి.
భూగర్భ జలాలు క్షీణిస్తే దాని ప్రభావం విపరీతంగా ఉంటుంది. బావులు ఎండిపోవడం, వాగులు, సరస్సులలో నీటి తగ్గుదల, నీటి నాణ్యత క్షీణించడం, పంపింగ్ ఖర్చులు పెరగడం, నేల తన సహజ స్వభావాన్ని కోల్పోవడం వంటివి జరుగుతాయి.
కారణాలు:
వివిధ అవసరాలకు మంచినీటి డిమాండ్ పెరగడం
వర్షపాతంలో మార్పులు
పెరిగిన జనాభా, పారిశ్రామికీకరణ & పట్టణీకరణ
నీటి వాడకంలో సరైన క్రమశిక్షణ లేకపోవడం. మొదలైన కారణాల వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గుతున్నాయి.
ఈ సమస్యను తగ్గించడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నాయి.
ఇక్కడ మంచి విషయం ఏంటంటే భూగర్భ జల స్థాయిని మనం పునరుద్ధరణ చేయవచ్చు . వర్షపాతం,నీటి ఊటలు మరియు ఇతర ఉపరి తల నీటి వనరుల నుండి పునర్వినియోగం చేయవచ్చు.నీరు రాష్ట్రానికి సంబంధించిన అంశం అయినప్పటికీ, దేశంలో వర్షపు నీటి సేకరణ భూగర్భ జలాల సంరక్షణ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం అనేక ముఖ్యమైన చర్యలు చేపట్టింది.
భారత ప్రభుత్వం 2019లో దేశంలోని 256 నీటి ఎద్దడి గల జిల్లాల్లో జల శక్తి అభియాన్ (JSA)ని ప్రారంభించింది, భూగర్భంలో నీటి లభ్యతను మెరుగుపరచడానికి 2021లో కూడా కొనసాగింది. ఇంకా, “జల్ శక్తి అభియాన్: క్యాచ్ ద రెయిన్” (వర్షపు నీరుని ఒడిసి పట్టండి ) 22 మార్చి 2021న ప్రారంభించారు. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణలో ‘మిషన్ కాకతీయ’, ఆంధ్రప్రదేశ్‌లో 'నీరు చెట్టు', రాజస్థాన్‌లోని 'ముఖ్యమంత్రి జల్ స్వావ్లంబన్ అభియాన్', మహారాష్ట్రలో 'జల్యూక్త్ శిబార్', గుజరాత్‌లో 'సుజలాం సుఫలాం అభియాన్' వంటి కార్యక్రమాలు నీటి సంరక్షణ / సాగు రంగంలో రాష్ట్రాలు చెప్పుకోదగ్గ కృషి చేస్తున్నాయి.
మరిన్ని చదవండి.
నిమ్మ జాతి చెట్లను అధిక దిగుబడికై సాగు చేయడం ఎలా
Share your comments