News

మిణుగురు పురుగుల గురించి తెలుసుకుందాం రండి...

KJ Staff
KJ Staff

రాత్రి వేళల్లో చుక్కలే భూమిమీదికి దిగువచ్చి మెరుస్తున్నాయా అన్నట్లు మిణుగురు పురుగులు దర్శనమిస్తాయి. ఈ సమస్త భూమండలం ఎంతో వైవిధ్యమైనది. ఎన్నో అద్భుతాలకు ఈ ప్రపంచం నిలయం. అటువంటి అద్భుతమైన ప్రాణుల్లో మిణుగురు పురుగులు ఒకటి. పురుగులు అనగానే పంటకు నష్టం కలిగించే కీటకాలు మాత్రమే కాదు, పర్యావరణానికి మేలు చేసేవి కూడా ఉన్నాయి, మిణుగురు పురుగులవల్ల పర్యావరణానికి మేలు చేకూరుతుంది. ఈ విభిన్నమైన పురుగుల గురించి వాటి విశిష్టతను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మిణుగురు పురుగులనే ఫైర్ ఫ్లైస్ అని కూడా పిలుస్తారు, వీటి శరీరం నుండి కాంతిని ఉత్పత్తి చెయ్యగలవు కాబట్టి వీటికి ఈ పేరు వచ్చింది. వీటి శరీరంలో జరిగే కొన్ని రసాయన ప్రక్రియలు జరగడంతో వీటి శరీరం నుండి ఈ కాంతి వెలువడుతుంది, ఈ పద్దతిని బయోల్యూమినిసెన్సే అని పిలుస్తారు. మిణుగురు పురుగుల పొట్ట భాగం నుండి ఈ కాంతి వెలువడుతుంది. మిణుగురు పురుగుల్లో అనేక జాతులున్నాయి, వేర్వేరు జాతులకు చెందిన పురుగుల నుండి వివిధ రంగుల కాంతిని విడుదల చేస్తాయి.

మిణుగురు ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ వ్యాప్తిచెంది ఉన్నాయి. కేవలం ఒక్క అంటార్కిటికాలో తప్ప మిగిలిన అన్ని కాండల్లోనూ వీటిని చూడొచ్చు. అయితే ఈ మిణుగురు పురుగులు కేవలం రాత్రివేళ్లలోనే కనిపిస్తాయి. కాంతి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మిణుగురు పురుగులు జీవించలేవు, కాంతి ఎక్కువుగా ఉన్న చోట్ల మిణుగురు పురుగులకు దృష్టిలోపం కలుగుతుంది.

వీటి జీవితకాలంలో రెండు దశలుంటాయి, మొదటిది లార్వా దశ, ఈ దశలో లార్వాలు నీటికి దగ్గరగా జీవిస్తూ, అక్కడ దొరికే నాచు, నత్తలు మరియు ఇతర చిన్న పురుగులను తిని జీవిస్తాయి, వీటినుండి ఉత్పత్తయ్యే కొన్ని రసాయనాలు ఎరను కదలనియ్యకుండా చేస్తాయి. అలాగే లార్వా నుండి ఎగిరే దశకు మారిన తరువాత పుప్పొడిని మరియు మకరందాన్ని తింటూ జీవిస్తాయి.

మిణుగురు పురుగుల ద్వారా పర్యావరణ కాలుష్యం ఎంత స్థాయిలో ఉందొ గుర్తించవచ్చు. ఉదాహరణకు వీటి లార్వా కేవలం మంచి నీటిలోనే పెరుగుతుంది, నీరు కలుషితం అయిన చోట్ల వీటి ఉదృతి తగ్గతూ వస్తుంది. అలాగే ఎగిరే మిణుగురు పురుగులు కేవలం అడువుల్లోనే జీవిస్తాయి, అయితే ఈ మధ్యకాలంలో అడవులు తగ్గతూరావడం మూలాన మిణుగురు పురుగులు కనుమరుగవుతున్నాయి. మిణుగురు పురుగులు కాంతికి సున్నితత్వం కలిగిఉంటాయి. ఎక్కువ కాంతి ప్రదేశాల్లో జీవించలేవు, పట్టణాల నుండి వెలువడుతున్న కాంతి వీటి సంతతి తగ్గిపోవడానికి కారణమవుతుంది. మణుగూరు పురుగులను కాపాడేందుకు ప్రపంచం మొత్తం మీద చాల ఎన్జిఓ లు పనిచేస్తున్నాయి. వీటిని రక్షించవలసిన బాధ్యత మనందరిమీద ఉంది.

Share your comments

Subscribe Magazine

More on News

More