గోదావరి, కృష్ణా, కావేరీల నదుల అనుసంధానం కోసం 2020 సంవత్సరంలో ముసాయిదా DETAILED PROJECT REPORT (డీపీఆర్)ను సిద్ధం చేసిన చేసిన విషయం తెలిసిందే అయితే దీనికి సంబంధించి తాజాగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్,తెలంగాణ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, మహారాష్ట్ర, రాష్ట్రాలు డీపీఆర్‌పై తమ అభిప్రాయాలను వెల్లడించాయి.
నదుల అనుసంధానం ప్రాజెక్టులో గోదావరి (ఇంచంపల్లి/జానంపేట్)-కృష్ణా (నాగార్జునసాగర్), కృష్ణా (నాగార్జునసాగర్)-పెన్నార్ (సోమశిల), పెన్నార్ (సోమశిల)-కావేరి (గ్రాండ్ అనికట్) అనే మూడు అనుసంధాన లింకులు ఉన్నాయి.డ్రాఫ్ట్ DPR ప్రకారం, కృష్ణా, పెన్నార్ మరియు కావేరి బేసిన్ల డిమాండ్లను తీర్చడానికి గోదావరి నది నుండి దాదాపు 247 TMC నీటిని లిఫ్టింగ్ ద్వారా మరియు మరింత దక్షిణాన నాగార్జునసాగర్ డ్యాంకు మళ్లించవచ్చు.ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 60,361 కోట్లుగా నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యుడిఎ) అంచనా వేసింది.
ఈ నదుల అనుసంధానం ప్రతిపాదన చాలా ఏళ్లుగా ఉన్న సంగతి తెలిసిందే . గోదావరిక నదికి వరదలు వచ్చే అవకాశం ఉంది, మరోవైపు కృష్ణాలో తగినంత నీరు లేదు.గోదావరి-కృష్ణా-కావేరీ నదుల అనుసంధానం ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నీటి వివాదాలను పరిష్కరిస్తామని గతంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
అయితే తాజాగా ముసాయిదా DETAILED PROJECT REPORT పై వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుండి వ్యాఖ్యలు స్వీకరించబడ్డాయి. నీటి భాగస్వామ్యం మొదలైన వాటిపై రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని పెంపొందించే ఉద్దేశ్యంతో, 29.10.2021 మరియు 18.02.2022 తేదీల్లో రాష్ట్రాలు/యూటీలతో సంప్రదింపుల సమావేశాలు నిర్వహించబడ్డాయి మరియు రాష్ట్రాలు/యూటీలు వాటి వివరాలను ధృవీకరించవలసిందిగా లేదా అనుబంధించవలసిందిగా అభ్యర్థించడం జరిగింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, మహారాష్ట్ర రాష్ట్రాలు DETAILED PROJECT REPORTపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి.రాష్ట్రాలు సూచించిన అంశాలు సాధ్యమయ్యేవిగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
మరిన్ని చదవండి.
Share your comments