DigiLocker అనేది వర్చువల్ లాకర్, ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఓటర్ ID కార్డ్ వంటి ముఖ్యమైన పత్రాలను నిల్వ చేయవచ్చు. లాకర్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి డిజిలో ఖాతాను సృష్టించడానికి ఆధార్ కార్డ్ అవసరమని కూడా పేర్కొన్న ప్రకటన ప్రకారం, అనేక ఇతర ప్రభుత్వ ధృవపత్రాలు ఇందులో నిల్వ చేయబడతాయి.
డిజిలాకర్‌తో, ఒకరు అతని లేదా ఆమె పత్రాలను ఎన్‌క్రిప్ట్ చేయవచ్చు మరియు అవసరమైనప్పుడు వాటిని సులభంగా డౌన్లోడ్
చేయవచ్చు, ప్రతిసారి హార్డ్ కాపీల తీసుకువెళ్లాసిన అవసరము ఉండదు .
మీరు కూడా మీ స్మార్ట్‌ఫోన్‌లో డిజీలాకర్ యాప్ ఇన్‌స్టాల్ చేశారా? ముఖ్యమైన డాక్యుమెంట్స్ డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నారా? ఇప్పుడు డిజీలాకర్ యాప్‌లోనే మీ నామినీ పేరు కూడా యాడ్ చేయొచ్చు. డిజీలాకర్ అందిస్తున్న కొత్త ఫీచర్ ఇది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది డిజీలాకర్. కొన్ని సింపుల్ స్టెప్స్‌తో నామినీ పేరు యాడ్ చేయొచ్చని తెలిపింది.
రేషన్ కార్డ్ హోల్డర్ల కు త్వరలో డిజిలాకర్ సదుపాయం , 3.6 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం!
- డిజీలాకర్ యాప్‌లో నామినీ పేరు యాడ్ చేయండిలా
- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో డిజీలాకర్ యాప్ ఇన్‌స్టాల్ చేయండి.
- యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ వివరాలతో సైనప్ చేయాలి. ముందుగానే
- సైనప్ చేస్తే డిజీలాకర్ అకౌంట్‌లో నేరుగా లాగిన్ కావాలి.
- ఆ తర్వాత మెనూలో నామినీ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
- Add Nominee పైన క్లిక్ చేయాలి.
- నామినీకి సంబంధించిన వివరాలన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
బ్యాంక్ అకౌంట్స్, పీఎఫ్ అకౌంట్స్, ఇన్స్యూరెన్స్ లాంటివాటికి నామినీ పేరు అవసరం. డిజీలాకర్ యాప్‌లోనే నామినీ పేరు యాడ్ చేయొచ్చు. డిజీలాకర్ విషయానికి వస్తే కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ ప్లాట్‌ఫామ్ రూపొందించింది. డిజీలాకర్ ద్వారా పౌరులకు అన్ని రకాల డాక్యుమెంట్స్ జారీ చేస్తోంది.
Share your comments